కాంగ్రెస్ MP అభ్యర్థికి రైతుల కష్టాలు తెలుసు: CM రేవంత్

by GSrikanth |
కాంగ్రెస్ MP అభ్యర్థికి రైతుల కష్టాలు తెలుసు: CM రేవంత్
X

దిశ, వెబ్‌డెస్క్: పార్లమెంట్ ఎన్నికల వేళ సీఎం రేవంత్ రెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. బుధవారం ఆర్మూర్‌లో కార్నర్ మీటింగ్ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. తాను పీసీసీ చీఫ్ కావడానికి ఆర్మూర్‌లో చేపట్టిన పసుపు దీక్షే కారణమన్నారు. బీఆర్ఎస్, బీజేపీలు ఏనాడూ పసుపు రైతులను పట్టించుకోలేదని విమర్శించారు. పదేళ్లు అధికారంలో ఉండి కూడా బీఆర్ఎస్ షుగర్ ఫ్యాక్టరీని పట్టించుకోలేదని అన్నారు. అందుకే రైతులు బీఆర్ఎస్‌ను బండకేసి కొట్టారని ఎద్దేవా చేశారు. మాజీ ఎమ్మెల్యే జీవన్ రెడ్డి ఆర్మూర్‌కు పట్టిన శని అని ఘాటు వ్యాఖ్యలు చేశారు. తనను గెలిపిస్తే ఐదు రోజుల్లో పసుపు బోర్డు తీసుకొస్తానని మాటిచ్చిన ధర్మపురి అర్వింద్ కూడా రైతులను నిండా ముంచారని విమర్శించారు. కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థికి రైతుల కష్టాలు తెలుసని చెప్పారు.

Advertisement

Next Story