- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- OTT Release
CM Revanth Reddy: రాహుల్ గాంధీని ప్రధానిగా చూసే వరకు విశ్రమించొద్దు
దిశ, వెబ్‌డెస్క్: కొన్ని ప్రాంతీయ పార్టీలు ముస్లిం(Muslims)లను ఆకర్షిస్తున్నాయని సీఎం రేవంత్ రెడ్డి(CM Revanth Reddy) అన్నారు. ఆ ప్రాంతీయ పార్టీలు ఢిల్లీలో ఎవరికి మద్దతు ఇస్తున్నాయో గమనించాలని ముస్లింలను సీఎం రేవంత్ రెడ్డి కోరారు. సోమవారం హైదరాబాద్‌లోని రవీంద్ర భారతీ(Rabindra Bharati)లో జాతీయ విద్యా దినోత్సవ- మైనారిటీ సంక్షేమ దినోత్సవ వేడుకలో సీఎం రేవంత్ రెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. హిందూ- ముస్లింలు తెలంగాణ ప్రభుత్వానికి రెండు కళ్లు లాంటివని అన్నారు. కాంగ్రెస్ పార్టీని అధికారంలోకి తీసుకురావడంలో మైనార్టీలు కీలక పాత్ర పోషించారని అభినందించారు. అదే జోష్‌తో మీరంతా అండగా ఉంటే విద్య, వైద్యం, ఉపాధి విషయంలో రాష్ట్రాన్ని అభివృద్ధి పథంలో ముందుకు నడిపించుకుందామన్నారు.
ప్రస్తుతం దేశంలో గాంధీ పరివార్, మోడీ పరివార్ మాత్రమే ఉన్నాయని అన్నారు. ప్రజల మధ్య చిచ్చు పెట్టేందుకు మోడీ పరివార్ పని చేస్తోందన్నారు. దేశ సమైక్యత కోసం గాంధీ పరివార్ కృషి చేస్తోందని అన్నారు. దేశంలో మైనార్టీలకు ముఖ్యమంత్రులుగా, మంత్రులుగా కాంగ్రెస్ పార్టీ అవకాశం ఇచ్చిందని గుర్తుచేశారు. మోడీ పరివార్‌తో ఉండాలో, గాంధీ పరివార్‌తో ఉండాలో మీరే నిర్ణయించుకోవాలని సూచించారు. మహారాష్ట్రలో కాంగ్రెస్ పార్టీని అధికారంలోకి తీసుకొచ్చేందుకు మైనారిటీలు తమవంతు కృషి చేయాలన్నారు. కేవలం కాంగ్రెస్‌తో అన్నివర్గాలకు న్యాయం జరుగుతుందని చెప్పకనే చెప్పారు. దేశంలో మోదీని ఓడించి రాహుల్‌గాంధీని ప్రధానిగా చూసే వరకు విశ్రమించొద్దన్నారు.