- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- సినిమా
- క్రైమ్
- లైఫ్ స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- భక్తి
స్టేషన్ ఘన్‌పూర్ సభపై సీఎం రేవంత్ రెడ్డి ఆసక్తికర ట్వీట్

దిశ, వెబ్ డెస్క్: ఆదివారం స్టేషన్ ఘన్ పూర్ (Station Ganpur) లో కాంగ్రెస్ పార్టీ (Congress Party) ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన సభ గురించి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి (CM revanth Reddy) ఆసక్తికర ట్వీట్ చేశారు. ఈ సందర్భంగా ఆయన.. తెలంగాణ రైజింగ్ విజన్ (Telangana Rising Vision) కు నాలుగు పునాది స్తంభాలు (Main Pillers) రైతులు (Farmers), మహిళలు (Womens), యువత (Youth), చారిత్రాత్మకంగా అణగారిన బలహీన వర్గాలు అని అన్నారు. అలాగే సాహసోపేతమైన లక్ష్యాలను సాధించడానికి తాము ప్రతి సమూహాన్ని సానుకూల కార్యక్రమాలు, వరుస పథకాలతో మారుస్తున్నామని తెలియజేశారు.
అంతేగాక "కోటి మహిళలు కోటీశ్వరులుగా" (Koti Mahilalu Kotiswarulu) చేయడం అనేది మహిళలలో గుప్తమైన వ్యవస్థాపక స్ఫూర్తిని ఉపయోగించడం ద్వారా వారిని మల్టీ-మిలియనీర్లుగా మార్చడానికి ఒక సాహసోపేతమైన కల అని చెప్పారు. ఇక నా సోదరీమణులు, తల్లులు నాకు అతిపెద్ద బలం, శక్తి అంటూ.. ఈ రోజు వారితో చర్చించిన తర్వాత, స్వయం సహాయక సంఘాలకు కొత్త ఆర్టీసీ బస్సులను అప్పగించడం గురించి విన్న తర్వాత, తెలంగాణ రైజింగ్ ఆగలేనిదని తాను నమ్ముతున్నాను అని రేవంత్ రెడ్డి రాసుకొచ్చారు.