- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
‘రేపటి నుండి మళ్లీ స్టార్ట్’.. ఎన్నికల ఫలితాలపై CM రేవంత్ రెడ్డి ఇంట్రెస్టింగ్ కామెంట్స్
దిశ, తెలంగాణ బ్యూరో: తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వ వంద రోజుల పాలనను ఆశీర్వదిస్తూ ఎనిమిది లోక్ సభ స్థానాలతో పాటు కంటోన్మెంట్ శాసన సభ ఉప ఎన్నికలో ప్రజలు విజయం చేకూర్చారని సీఎం రేవంత్ రెడ్డి పేర్కొన్నారు. ప్రజలు అందించిన ఈ ఆశీర్వాదాలు తమ ఆత్మస్థైర్యాన్ని మరింత పెంచాయని మంగళవారం ఓ ప్రకటనలో పేర్కొన్నారు. రాబోయే రోజుల్లో మరింత సమర్ధవంతమైన పాలన అందివ్వడానికి ఈ ఫలితాలు ఉత్సాహాన్నిచ్చాయన్నారు. ప్రజల మద్ధతు కాంగ్రెస్ పార్టీకే ఉన్నదన్న విషయాన్ని ఈ ఎన్నికల ఫలితాలు మరోసారి రుజువు చేశాయన్నారు.
కాంగ్రెస్ విజయం కోసం పని చేసిన కార్యకర్తలు, నాయకులు, శ్రేయోభిలాషులందరికీ అభినందనలు, కృతజ్ఞతలు తెలిపారు. ఇది కార్యకర్తల విజయమని, వాళ్ల శ్రమ, కష్టాన్ని పార్టీ గుర్తిస్తుందన్నారు. బుధవారంతోఎన్నికల కోడ్ ముగుస్తోందని, మళ్లీ ప్రజా ప్రభుత్వ పాలన మొదలవుతుందన్నారు. రాష్ట్ర అభివృద్ధి, ప్రజల సంక్షేమమే లక్ష్యంగా అద్భుతమైన పాలన అందిస్తామన్నారు. రాబోయే రోజుల్లో తెలంగాణ ప్రజల హృదయాల్లో చిరస్థాయిగా నిలిచిపోయే విధంగా ప్రజా పాలన ఉంటుందన్నారు.