ఉగాది శుభాకాంక్షలు చెప్పిన CM రేవంత్ రెడ్డి.. రాష్ట్ర ప్రజలకు కీలక పిలుపు

by Anjali |
ఉగాది శుభాకాంక్షలు చెప్పిన CM రేవంత్ రెడ్డి.. రాష్ట్ర ప్రజలకు కీలక పిలుపు
X

దిశ, వెబ్‌డెస్క్: తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రజలకు ఉగాది శుభాకాంక్షలు తెలియజేశారు. రేపటి నుంచి శ్రీ కోధి నామ సంవత్సరం ప్రారంభం కానున్న సందర్భంగా.. కొత్త సంవత్సరంలో ప్రజలందరికీ మంచి జరగాలని.. ప్రజల కోరికలు నేరవేరాలని ఆకాంక్షించారు. సమృద్ధిగా వానలు కురిసి, రైతుల కుటుంబాల్లో సుఖ సంతోషాలు వెల్లివిరియాలని, వచ్చే ఏడాది కాలం కలిసి రావాలని అభిలషించారు. అలాగే కొత్త సంవత్సరంలో తెలంగాణ రాష్ట్రం అన్ని రంగాల్లో మెరుగైన అభివృద్ధి సాధిస్తుందని తెలియజేశారు. దేశానికే ఆదర్శంగా నిలుస్తుందని ఆశాభావం వ్యక్తం చేశారు. మన సంస్కృతి సంప్రదాయాలు చాటిచెప్పేలా ఉగాది పండుగను ఆనందంగా సెలబ్రేట్ చేసుకోవాలని పిలుపునిచ్చారు. గత ఏడాది ముఖ్యమంత్రి బాధ్యతలు చేపట్టినా రేవంత్ రెడ్డి.. ఎన్నికల ప్రచారంలో భాగంగా ఇచ్చిన హామీలు ఒక్కొక్కటి నేరవేర్చుతూ వస్తున్నారు.

Advertisement

Next Story

Most Viewed