CM Revanth Reddy: చేనేతకు పునరుజ్జీవం కల్పించడం మా బాధ్యత : సీఎం రేవంత్‌రెడ్డి

by Prasad Jukanti |
CM Revanth Reddy: చేనేతకు పునరుజ్జీవం కల్పించడం మా బాధ్యత : సీఎం రేవంత్‌రెడ్డి
X

దిశ, డైనమిక్ బ్యూరో: చేనేతకు పునరుజ్జీవం కల్పించడాన్ని ప్రజా ప్రభుత్వం బాధ్యతగా భావిస్తున్నదని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తెలిపారు. జాతీయ చేనేత దినోత్సవం పురస్కరించుకుని చేనేతలు అందరికీ సీఎం శుభాకాంక్షలు తెలిపారు. ఈ మేరకు ఓ ప్రకటన విడుదల చేశారు. నాటి స్వాతంత్ర్య సంగ్రామంలో ఒక సాధనమైన చేనేత నేటి తెలంగాణ పునర్నిర్మాణంలోనూ ప్రధానంగా నిలిచిందన్నారు. మహిళా శక్తి గ్రూపులు, ప్రభుత్వ శాఖల ద్వారా చేనేతను ప్రోత్సహించే కార్యక్రమాలకు ప్రభుత్వం శ్రీకారం చుట్టిందని పేర్కొన్నారు. మగ్గం తో మానవాళికి నాగరికత నేసి చూపే సాంస్కృతిక కళాకారులు మన నేతకారులు అంటూ వారి ప్రతిభా పాఠవాలు, సేవలను కొనియాడారు.

Advertisement

Next Story