- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
CM Revanth Reddy: ఢిల్లీ టు ముంబయి.. సీఎం రేవంత్ రెడ్డి క్రేజ్ తో ఖతర్నాక్ ప్లాన్
దిశ, డైనమిక్ బ్యూరో: ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి (CM Revanth Reddy) ఢిల్లీకి (Delhi Tour) బయలుదేరి వెళ్లారు. మంగళవారం ఉదయం శంషాబాద్ ఎయిర్ పోర్ట్ నుంచి ఆయన హస్తినా టూర్ కు బయలుదేరారు. మరో వైపు జార్ఖండ్ ఎన్నికల ప్రచారంలో ఉన్న డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క (Deputy CM Bhatti) సైతం అక్కడి నుంచి ఇవాళ ఢిల్లీకి చేరుకుంటారు. అక్కడ వీరిరువురు ఏఐసీసీ (AICC Meeting) అంతర్గత సమావేశానికి హాజరుకానున్నారు. అనంతరం సీఎం రేవంత్ రెడ్డి ఏఐసీసీ పెద్దలతో భేటీ అయే అవకాశం ఉన్నట్లు తెలుస్తున్నది. మంత్రివర్గ విస్తరణ, స్థానిక సంస్థల ఎన్నికలు, కులగణన వంటి కీలకమైన అంశాలపై చర్చ జరుగుతున్న వేళ సీఎం ఢిల్లీ పర్యటనకు వెళ్లడం ప్రాధాన్యత సంతరించుకుంది.
సీఎం రేవంత్ క్రేజ్ యూజ్ చేసుకునేలా..
ఇవాళ రాత్రి ఢిల్లీలోనే బస చేయనున్న సీఎం రేవంత్ రెడ్డి బుధవారం మహారాష్ట్రకు వెళ్లనున్నారు. మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికలకు (Maharashtra Elections) మరో వారం రోజులే గడువు ఉండటంతో అన్ని పార్టీలు ప్రచారాన్ని ముమ్మరం చేశారు. ఈ నేపథ్యంలో తెలంగాణలో ప్రచారాన్ని ఒంటిచేత్తో ముందుకు తీసుకెళ్లిన రేవంత్ రెడ్డి క్రేజ్ ను ఉపయోగించుకునేందుకు కూటమి నేతలు సిద్ధమయ్యారు. తెలంగాణలో తరహాలో సక్సెస్ మంత్రాను సిద్ధం చేయాలని సీఎం రేవంత్ రెడ్డిని మహా అఘాడి నేతలు (Maha Vikas Aghadi) రేవంత్ రెడ్డిని కోరారు.
ఈ నేపథ్యంలో ప్రచార వ్యూహాలను, అనుసరించాల్సిన విధానాలను కూటమి నేతలకు సీఎం రేవంత్ రెడ్డి వివరించనున్నారు. మహారాష్ట్రలో ర్యాలీలు, రోడ్డు, షోలు, కార్నర్ మీటింగ్ లకు సిబంధించిన కార్యాచరణను సీఎం మహా నేతలకు వివరించనున్నారు. అలాగే అక్కడ ఎన్నికల ప్రచారంలో సైతం పాల్గొననున్నారు. అనంతరం హైదరాబాద్ కు తిరిగి చేరుకోనున్నారు. కూటమి తరపున పెద్దఎత్తున ర్యాలీలు, రోడ్ షోలు, కార్నర్ మీటింగ్‌లకు ప్లాన్ చేస్తున్న తరుణంలో వచ్చే వారం మరోమారు మహారాష్ట్ర ఎన్నికల ప్రచారానికి సీఎం వెళ్లనున్నట్లు తెలుస్తున్నది.