- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
CM Revanth Reddy: మహారాష్ట్రను దోచుకునేందుకు ఇద్దరు గుజరాతీలు దిగారు.. సీఎం రేవంత్ సంచలన వ్యాఖ్యలు
దిశ, వెబ్‌డెస్క్: మూసీ నది (Musi River)ని బాగుచేయడం బీజేపీ (BJP) నేతలకు ఇష్టం లేదా అని సీఎం రేవంత్ రెడ్డి (CM Revanth Reddy) ప్రశ్నించారు. మహారాష్ట్ర (Maharastra) ఎన్నికల ప్రచారంలో ఉన్న ఆయన బీజేపీ (BJP) నేతల బస్తీ నిద్రపై కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి (Union Kishan Reddy) టార్గెట్‌గా సంచలన వ్యాఖ్యలు చేశారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ.. సబర్మతి నది (Sabarmati River) ప్రక్షాళన చేసినప్పుడు ప్రధాని నరేంద్ర మోడీ (Prime Minister Narendra Modi)ని కిషన్‌రెడ్డి ఎందుకు ప్రశ్నించ లేదని కామెంట్ చేశారు. ఆనాడు సబర్మతి (Sabarmati) ప్రక్షాళన కోసం ఏకంగా 15 వేల కుటుంబాలను మరోచోటికి తరలించారని గుర్తు చేశారు. గుజరాత్ మోడల్ (Gujrarat Model) దేశానికి ఆదర్శమని బీజేపీ (BJP) నేతలు చెబుతున్నారని.. మూసీ ప్రాజెక్ట్ (Musi Project) విషయంలో మాత్రం రాష్ట్రంలో కమలనాథులు అడ్డుపడుతున్నారని ఎద్దేవా చేశారు.
మూసీ ప్రాజెక్ట్ (Musi Project) వద్దంటున్నారంటే గుజరాత్ మోడల్ (Gujarat Model) ఫెయిల్ అయినట్లేనా అని సీఎం (CM) ప్రశ్నించారు. మహారాష్ట్ర (Maharastra) ప్రజలను మోసం చేసేందుకు బీజేపీ (BJP) ఏక్‌నాథ్ షిండేను పావుగా వాడుకుందని ఫైర్ అయ్యారు. తెలంగాణ (Telangana)లో కూడా కిషన్‌రెడ్డి (Kishan Reddy)ని అదే తరహాలో ప్రయోగిస్తున్నారని ఆరోపించారు. మహారాష్ట్ర (Maharastra)ను దోచుకునేందుకు ఇద్దరు గుజరాతీలు (Gujaratis) వచ్చారని.. ధారావి ప్రాజెక్ట్ (Dharavi Project)ను అడ్డు పెట్టుకుని పెద్ద మొత్తంలో లూఠీ చేసేందుకు స్కెచ్ వేశారని ధ్వజమెత్తారు. మహారాష్ట్ర (Maharastra)కు రావాల్సిన 17 కంపెనీలను ప్రధాని మోడీ మోసపూరితంగా గుజరాత్ (Gujarat)కు తరలించారని మండిపడ్డారు. ఇక వారికి అవకాశం ఇచ్చేందుకు మహారాష్ట్ర (Maharastra) ప్రజలు కూడా సిద్ధంగా లేరని సీఎం రేవంత్‌రెడ్డి అన్నారు.
మహాయుతి కూటమి (Mahayuti Alliance)కి గుణపాఠం చెప్పేందుకు రైతులు, పేదలు సిద్ధంగా ఉన్నారని తెలిపారు. 11 ఏళ్లు అధికారంలో ఉన్న ప్రధాని మోడీ (PM Modi) ఏం చేశారని ప్రశ్నించారు. దేశ వ్యాప్తంగా 2 కోట్ల ఉద్యోగాలు ఇస్తామని చెప్పి ఎన్ని ఇచ్చారో లెక్కలు చెప్పాలన్ని డిమాండ్ చేశారు. రైతుల ఆదాయం రెట్టింపు చేస్తామని, ప్రతి పేదవాడికి ఇళ్లు కట్టిస్తామని ఇచ్చిన హామీ ఏమైందని ప్రశ్నించారు. మహారాష్ట్ర ఎన్నికల్లో మహాయుతి కూటమికి చోటు లేదని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు.