CM Revanth Reddy: ఇది తరతరాలకు మేలు చేసే నిర్ణయం.. అండగా నిలిచే ప్రతి వ్యక్తికి థాంక్స్

by Gantepaka Srikanth |
CM Revanth Reddy: ఇది తరతరాలకు మేలు చేసే నిర్ణయం.. అండగా నిలిచే ప్రతి వ్యక్తికి థాంక్స్
X

దిశ, వెబ్‌డెస్క్: నదుల వెంట నాగరికత వర్ధల్లాలని సీఎం రేవంత్ రెడ్డి(CM Revanth Reddy) పేర్కొన్నారు. నదులను కబళిస్తే మనిషి మనుగడే ప్రశ్నార్థకమవుతుందని అన్నారు. ప్రపంచ స్థాయి ప్రమాణాలతో అభివృద్ధి చెందాల్సిన హైదరాబాద్‌కు మూసీ ఒక వరం కావాలని ఆకాంక్షించారు. ఎట్టిపరిస్థితుల్లో శాపంగా మిగిలిపోనివ్వమని అన్నారు. తెలంగాణ(Telangana) ప్రజల ఆరోగ్యం.. తెలంగాణ ఆర్థిక వ్యవస్థ ఈ రెండూ కీలకమే అని తెలిపారు. మూసీ(Musi) ప్రక్షాళన చేయాలని ప్రజాప్రభుత్వం ఆల్రేడీ సంకల్పం తీసుకున్నదని.. ఎవరూ అడ్డువచ్చినా ఇది ఆగదని అన్నారు. ఈ తరానికే కాదు.. తరతరాలకు మేలు చేసే నిర్ణయమని ఇది అని అభిప్రాయపడ్డారు.

ఈ నిర్ణయానికి అండగా నిలిచే ప్రతి వ్యక్తికి.. ప్రతి వ్యవస్థకి ధన్యవాదాలు అని తెలిపారు. మరోవైపు రాష్ట్ర ప్రభుత్వ విజ్ఞప్తి మేరకు ‘లేక్ మ్యాన్ ఆఫ్ ఇండియా’గా పేరొందిన కర్ణాటకకు చెందిన ఆనంద్‌ హైదరాబాద్‌ వచ్చారు. మూడు రోజులుగా రాజధానిలో పర్యటిస్తున్నారు. హైడ్రా కమిషనర్‌ రంగనాథ్‌, జీహెచ్‌ఎంసీ, హెచ్‌ఎండీఏ, జలమండలి ఉన్నతాధికారులతో కలిసి.. మురికికూపాలుగా మారిన చెరువులను పరిశీలిస్తున్నారు. ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా భావిస్తున్న మూసీ ప్రాజెక్టుకు సాంకేతిక సలహాదారుడిగానూ వ్యవహరిస్తున్నారు. ఆయన హైదరాబాద్‌లో చెరువులను పరిశీలిస్తున్న ఫొటోలను జతచేసి సీఎం రేవంత్ గురువారం ట్వీట్ పెట్టారు.


Advertisement

Next Story