CM Revanth Reddy : కేంద్రమంత్రులతో భేటీ కానున్న సీఎం రేవంత్ రెడ్డి

by M.Rajitha |
CM Revanth Reddy : కేంద్రమంత్రులతో భేటీ కానున్న సీఎం రేవంత్ రెడ్డి
X

దిశ, వెబ్ డెస్క్ : తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి(CM Revanth Reddy) రెండు రోజుల పర్యటన నిమిత్తం ఢిల్లీ(Delhi) వెళ్లిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో నేటి సాయంత్రం పలువురు కేంద్రమంత్రులతో సమావేశం కానున్నారు. మొదట కేంద్ర బొగ్గు, గనులశాఖ మంత్రి కిషన్ రెడ్డి(Kishan Reddy)తో సాయంత్రం 5.30 గంటలకు, అనంతరం రాత్రి 7 గంటలకు కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్(Dharmendra Pradhan) తో సమావేశం అవనున్నారు. ఆ తర్వాత 7.30 గంటలకు కేంద్ర రోడ్డు రవాణా, రహదారులశాఖ మంత్రి నితిన్ గడ్కరీ(Nitin Gadkari)తో సీఎం రేవంత్ రెడ్డి భేటీ కానున్నారు. రాష్ట్రానికి రావాల్సిన పలు అనుమతులు, నిధుల మంజూరు గురించి వీరితో సీఎం చర్చించనున్నారు.

Advertisement

Next Story

Most Viewed