- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
రేపు ఢిల్లీకి సీఎం రేవంత్ రెడ్డి.. కాంగ్రెస్ ఫైనల్ లిస్ట్ ఎప్పుడంటే?
దిశ, డైనమిక్ బ్యూరో: తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి రేపు ఢిల్లీకి వెళ్లనున్నారు. లోక్‌సభ ఎన్నికల నేపథ్యంలో రేపు ఢిల్లీలో సీఈసీ సమావేశంలో పాల్గొననున్నారు. ఈ క్రమంలోనే తెలంగాణలో మిగిలిన లోక్‌సభ స్థానాల అభ్యర్థుల విషయమై అధిష్టానంతో చర్చించనున్నారు. కాగా, తెలంగాణ కాంగ్రెస్ తుది జాబితాపై కసరత్తు చేస్తున్నది. పార్లమెంట్ ఎన్నికల్లో మెజార్టీ స్థానాలను గెలుచుకునేందుకు సీఎం రేవంత్ రెడ్డి ప్రత్యేకంగా ఫోకస్ పెట్టారు. పార్టీ నేతలకు, శ్రేణులకు ఈ క్రమంలోనే దిశానిర్ధేశం చేశారు.
రేపు తుది జాబితా వచ్చే ఛాన్స్!
తొమ్మిది లోక్ సభ స్థానాలకు అభ్యర్థులను ఎంపిక చేసిన విషయం తెలిసిందే. బుధవారం జరుగనున్న మీటింగ్‌లో మరో 8 స్థానాలపై ఫైనల్ లిస్ట్ వచ్చే అవకాశం ఉన్నట్లు టాక్ నడుస్తోంది. సీఎం రేవంత్ రెడ్డి ఢిల్లీలో జరగనున్న కేంద్ర స్క్రీనింగ్ కమిటీ సమావేశానికి హాజరై.. తాను ప్రతిపాదించిన ఎనిమిది స్థానాల అభ్యర్థుల జాబితా కూడా మరోసారి రేవంత్ రెడ్డి ప్రతిపాదించే అవకాశాలు ఉన్నాయి.