CM Revanth: తక్షణమే కిషన్ రెడ్డి రాజీనామా చేయాలి: CM రేవంత్ సంచలన డిమాండ్

by Satheesh |   ( Updated:2024-07-23 12:51:53.0  )
CM Revanth: తక్షణమే కిషన్ రెడ్డి రాజీనామా చేయాలి: CM రేవంత్ సంచలన డిమాండ్
X

దిశ, వెబ్‌డెస్క్: కేంద్ర ప్రభుత్వ బడ్జెట్‌పై సీఎం రేవంత్ నిప్పులు చెరిగారు. హైదరాబాద్ జూబ్లీహిల్స్‌లోని తన నివాసంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో రేవంత్ మాట్లాడుతూ.. బడ్జెట్‌లో తెలంగాణకు నిధులు కేటాయించకుండా కేంద్ర ప్రభుత్వం వివక్ష చూపించిందన్నారు. వెంటనే బడ్జెట్‌ను సవరించి తెలంగాణకు న్యాయం చేయాలని డిమాండ్ చేశారు. మా సహనాన్ని చేతగానితనం అనుకోవద్దని కేంద్రానికి స్వీట్ వార్నింగ్ ఇచ్చారు. బడ్జెట్ కేటాయింపుల్లో వివక్షపై కేంద్రాన్ని నిలదీస్తామని, నిరసనలు చేస్తామని.. ఇందుకు తెలంగాణ బీజేపీ ఎంపీలు, ఎమ్మెల్యేలు కలిసి రావాలని పిలుపునిచ్చారు. 41 లక్షల కోట్ల బడ్జెట్‌ను కేవలం ఎన్డీఏ మిత్ర పక్ష రాష్ట్రాలకే దోచిపెట్టారని ఆగ్రహం వ్యక్తం చేశారు.

నిధుల కేటాయించకుండా బీజేపీ తెలంగాణకు అన్యాయం చేసిన కేంద్రమంత్రులు బండి సంజయ్, కిషన్ రెడ్డి బీజేపీకి బానిసల్లా పని చేయొద్దన్నారు. బీజేపీ, ఎంఐఎం ఎంపీలు చిత్తశుద్ధి నిరూపించుకోవాలని.. రాజకీయాలకు అతీతంగా రాష్ట్రం కోసం పని చేద్దామని కోరారు. తెలంగాణపై కేంద్రం చూపించే వివక్ష మంచిది కాదని.. ప్రధాని మోడీ చర్యలను తెలంగాణ ప్రభుత్వం తీవ్రంగా ఖండిస్తుందన్నారు. బీజేపీకి తెలంగాణ ప్రజలు ఇచ్చిన 8 ఎంపీ సీట్లతోనే మోడీ ప్రధాని కూర్చీలో కుర్చున్నారని.. 8 ఎంపీ సీట్లు, 35 శాతం ఓటింగ్ ఇచ్చినప్పటికీ తెలంగాణపై బీజేపీ వివక్ష చూపిస్తోందని ఆగ్రహం వ్యక్తం చేశారు. తెలంగాణకు ఐఐఎం ఇవ్వలేమని కేంద్రమంత్రి ధర్మేంద్ర ప్రధాన్ తనకు లేఖ రాశారని, మరీ ఐఐఎం తెలంగాణకు ఇవ్వనప్పుడు కేంద్రమంత్రిగా కిషన్ రెడ్డి ఎందుకు కొనసాగుతున్నారని.. వెంటనే కిషన్ రెడ్డి కేంద్ర మంత్రి పదవికి రాజీనామా చేయాలని రేవంత్ రెడ్డి డిమాండ్ చేశారు.

Advertisement

Next Story