మండుటెండలో గద్దరన్నను గేటు ఎదుట నిల్చోబెట్టారు: సీఎం రేవంత్

by GSrikanth |   ( Updated:2023-12-16 11:35:58.0  )
మండుటెండలో గద్దరన్నను గేటు ఎదుట నిల్చోబెట్టారు: సీఎం రేవంత్
X

దిశ, వెబ్‌డెస్క్: బీఆర్ఎస్ ప్రభుత్వంలో ప్రగతి భవన్ వద్ద ప్రజాయుద్ధ నౌక గద్దర్‌కు జరిగిన అవమానాన్ని సీఎం రేవంత్ రెడ్డి గుర్తుచేశారు. శనివారం అసెంబ్లీలో సీఎం మాట్లాడుతూ.. ‘ప్రజాయుద్ధ నౌక గద్దరన్న తెలంగాణ ప్రజల పక్షాన గళం విప్పి గజ్జెకట్టి గొంగడేసుకుని తండాలు, గూడాలు, మారుమూల పల్లెల్లో తిరిగి ప్రజలను ప్రభావితం చేశారు. రాష్ట్ర ఉద్యమంలో కీలక పాత్ర పోషించారు. అలాంటి వ్యక్తి స్వరాష్ట్రంలో సీఎంను కలవడానికి వస్తే మూడు గంటలకు ప్రగతి భవన్‌ ఎదుట మండుటెండలో నిల్చోబెట్టారని మండిపడ్డారు.

అలాంటి పరిస్థితులు రాష్ట్రంలో మళ్లీ రాకూడదనే కాంగ్రెస్ ప్రభుత్వం రాగానే ప్రగతి భవన్‌ చుట్టూ ఉన్న ఇనుప కంచెలను తొలగించామని తెలిపారు. ఆనాడు సీఎంను కలవాలంటే మంత్రులకే ప్రవేశం ఉండేది కాదని గుర్తుచేశారు. కానీ, నేడు పరిస్థితులు పూర్తిగా తారుమారు అయ్యాయని, నేరుగా ముఖ్యమంత్రికే సమస్యలు చెప్పుకునేలా ప్రజావాణి నిర్వహిస్తున్నామని చెప్పారు.

Read More : బీఆర్ఎస్ ఎమ్మెల్యేలకు సీఎం రేవంత్ రెడ్డి స్వీట్ వార్నింగ్

Advertisement

Next Story

Most Viewed