మహారాష్ట్రతో మొదలైన చర్చలు..ప్రాణహిత చేవెళ్ల ప్రాజెక్టుపై సీఎం కీలక ప్రకటన

by Prasad Jukanti |
మహారాష్ట్రతో మొదలైన చర్చలు..ప్రాణహిత చేవెళ్ల ప్రాజెక్టుపై సీఎం కీలక ప్రకటన
X

దిశ, డైనమిక్ బ్యూరో:తుమ్మిడిహెట్టిలో ప్రాణహిత-చేవెళ్ల ప్రాజెక్టును తప్పకుండా కట్టి తీరుతామని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. దీనికోసం తెలంగాణ ప్రభుత్వం మహారాష్ట్రతో చర్చలు జరుపుతున్నామని, మహారాష్ట్రలో ముంపుకు గురయ్యే భూముల విషయంలో ఆ ప్రభుత్వాన్ని ఒప్పించి ఆ ప్రాంత రైతాంగాన్ని మెప్పించి, సరైన నష్టపరిహారం ఇప్పించి ప్రాణహిత ప్రాజెక్టును తప్పకుండా నిర్మించి దానికి దానికి డా.బిఆర్ అంబేడ్కర్ పేరు పెడతామని అన్నారు. సోమవారం ఆదిలాబాద్ లో కాంగ్రెస్ ఆధ్వర్యంలో నిర్వహించిన జనజాతర సభలో ముఖ్యమంత్రి మాట్లాడారు. ఈ సందర్భంగా ఆదిలాబాద్ ప్రజలపై వరాల జల్లు కురిపించారు. కుప్టి ప్రాజెక్టును నిర్మించి ఆదిలాబాద్ ను సస్యశ్యామలం చేస్తామని, కడెం ప్రాజెక్టుకు మరమ్మతులు చేపడతామన్నారు. జిల్లాతుమ్మిడిహెట్టిలో ప్రాణహిత-చేవెళ్ల ప్రాజెక్టును తప్పకుండా కట్టి తీరుతామని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు.లో విద్యా, ఉద్యోగా ఉపాధి అవకాశాలు మెరుగు పరచేలా ఆదిలాబాద్ లో కొత్త యూనివర్సిటీ ఏర్పాటు చేయడంతో పాటు నాగోబా జాతరకు రూ.4 కోట్లు కేటాయించనున్నామని ప్రకటించారు. మోడీ, కేసీఆర్ ఇద్దరూ తోడు దొందలేనని ఈ ఇద్దరు కలిసి ఆదిలాబాద్ లోని సీసీఐ సిమెంట్ పరిశ్రమను మూసేశారని త్వరలోనే దీన్ని మా ప్రభుత్వం రీ ఓపెన్ చేస్తామని హామీ ఇచ్చారు. రూ.2 లక్షల రైతు రుణమాఫీ చేస్తామన్నారు. అన్నదాత పండించిన ప్రతి గింజ కొంటున్నామన్నారు.

పేదల ప్రభుత్వాన్ని ఎందుకు కూల్చుతారు?:

అధికారంలోకి వచ్చిన 100 రోజుల్లోనే ఐదు గ్యారెంటీలను అమలు చేసిన తమ ప్రభుత్వాన్ని కూలగొట్టాలని ఢిల్లీలో ఉన్న మోడీ, గల్లీలో ఉన్న కేసీఆర్ ప్రయత్నిస్తున్నారని.. ఆడబిడ్డలకు ఆర్టీసీలో ఉచిత ప్రయాణం అవకాశం కల్పించినందుకా? రాజీవ్ ఆరోగ్యశ్రీ కింద పేదలకు 10 లక్షల వరకు ఉచిత వైద్యం అందిస్తున్నందుకా? 200 యూనిట్ల ఉచిత విద్యుత్ ఇస్తున్నందుకా? ఎందుకు కాంగ్రెస్ ప్రభుత్వాన్ని కూలదోస్తారని ప్రశ్నించారు. పదేళ్ల పాలనలో ఆదిలాబాద్ తండాలు, గూడేలాలో పేదవాళ్లకు డబుల్ బెడ్ రూమ్ ఇళ్లు ఇవ్వకపోయినా కేసీఆర్ పదేకరాలలో పెద్ద భవంతులు, జన్వాడలో కేసీఆర్ కొడుకు వెయ్యి కోట్లతో ఫామ్ హౌస్ నిర్మించుకున్నాడని ఆరోపించారు. అధికారంలోకి వచ్చి వందరోజులే అయినా ప్రభుత్వాన్ని దిగిపోవాలంటున్నారు.. పదేళ్లుగా కేసీఆర్, ప్రధానిగా పని ఇచ్చిన హామీలు అమలు చేయని వారిని నడిబజారులో ఉరితీయాలా అని ప్రశ్నించారు. ఎంపీ ఎన్నికల్లో ఈ రెండు పార్టీలకు బుద్ధి చెప్పాలని పిలుపునిచ్చారు. డిసెంబర్ ఎన్నికల్లో రాష్ట్రంలోని ఒక దొంగను బండకేసి కొట్టాలని లోక్ సభ ఎన్నికల్లో ఢిల్లీ దొంగను బండకేసి కొట్టాలని పిలిపునిచ్చారు. ఎంపీ ఎన్నికల్లో బీఆర్ఎస్, బీజేపీలకు బుద్ధి చెప్పాలన్నారు.

Advertisement

Next Story

Most Viewed