- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
CM Revanth Reddy: కేసీఆర్.. ఇప్పటికైనా నీ పెద్దరికాన్ని నిలబెట్టుకో: సీఎం రేవంత్ సెన్సేషనల్ కామెంట్స్
దిశ, వెబ్‌డెస్క్: ఇప్పటికైనా ప్రతిపక్ష నేతగా కేసీఆర్ అసెంబ్లీకి వచ్చి తన పెద్దరికాన్ని నిలబెట్టుకోవాలని సీఎం రేవంత్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. ఇవాళ సచివాలయం (Secretariat)లో ఇందిరమ్మ ఇళ్ల సర్వే యాప్‌ను ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. బీఆర్ఎస్ (BRS) ప్రభుత్వ హయాంలో సచివాలయం (Secretariat), వ్యక్తిగత ఫాంహౌస్ (Farm Houses)లను నెలల వ్యవధిలోనే నిర్మించారని.. రూ.కోట్లు ఖర్చు పెట్టి 33 జిల్లాల్లో బీఆర్ఎస్ (BRS) పార్టీ ఆఫీసులు కట్టుకున్నారని ఆరోపించారు.
కానీ, నిరుపేదలకు కల అయిన ఇళ్లను మాత్రం పూర్తి చేయలేకపోయారని ఎద్దేవా చేశారు. రూ.16 వేల కోట్ల మిగులు బడ్జెట్‌తో కేసీఆర్ (KCR) చేతుల్లోకి రాష్ట్రం వచ్చిందని.. పదేళ్ల పాలనలో రూ.7లక్షల కోట్లు అప్పు చేసి మాకు అప్పగించారని సెటైర్లు వేశారు. అప్పులు చేయడమే కాకుండా ప్రభుత్వ ఆస్తులను సైతం అమ్మేశారని ఫైర్ అయ్యారు. అభివృద్ధి, సంక్షేమాన్ని రెండు కళ్లలా భావించి 60 ఏళ్లు రాష్ట్రాన్ని కాంగ్రెస్ (Congress) పాలించిందని అన్నారు. గత పదేళ్లలో రాష్ట్రాన్ని అర్థిక సంక్షోభంలోకి నెట్టేశారని ధ్వజమెత్తారు. చేసిన అప్పులకు వడ్డి కట్టడానికి మళ్లీ అప్పు చేయాల్సిన దుస్థితి దాపురించిందని అన్నారు. ప్రభుత్వానికి విపక్ష నేతలు సలహాలు ఇచ్చే సాంప్రదాయం గతంతో ఉండేదని.. ఆ సాంప్రదాయాన్ని నేడు ప్రతిపక్షాలు దెబ్బతీస్తున్నాయని అన్నారు.
పాలక, ప్రతిపక్షాలు అంటే శత్రు పక్షాలు అన్నట్లుగా వాతావరణం సృష్టించాయని సీఎం (CM) తెలిపారు. ప్రభుత్వం అంటే 64 మంది కాంగ్రెస్ (Congress) సభ్యులు మాత్రమే కాదని.. 119 మంది సభ్యులు కలిస్తేనే ప్రభుత్వమని అన్నారు. అసెంబ్లీ (Assembly)లో ప్రభుత్వానికి, ప్రతిపక్షానికి ఓకే ప్రధాన్యత ఉంటుందని.. ప్రతిపక్ష నేత సభకు రాకపోవడం ఏం సాంప్రదాయమని ప్రశ్నించారు. అసెంబ్లీలో ప్రతిపక్ష నాయకుడి కుర్చీ ఖాళీగా ఉడటం రాష్ట్రానికి శ్రేయస్కరం కాదని సీఎం రేవంత్ రెడ్డి (CM Revanth Reddy) అన్నారు. కేసీఆర్ (KCR) అసెంబ్లీ (Assembly)కి వచ్చి ప్రభుత్వాన్ని ఇరుకున పెట్టాలని.. సూచనలివ్వాలంటూ ఛలోక్తులు విసిరారు. తాను పెద్ద మనిషినని చెప్పనుకునే కేసీఆర్ (KCR) ఇప్పటికైనా.. ఆ పెద్దరికాన్ని నిలబెట్టుకోవాలని అన్నారు. బీఆర్ఎస్ (BRS) సభ్యులు చిల్లర పనులు చేస్తే పెద్ద మనిషిగా వారి తప్పులను సరిదిద్దాలని సీఎం రేవంత్ రెడ్డి చురకలంటించారు.