- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
కేసీఆర్‌కు ఆపరేషన్.. కాసేపట్లో ఆసుపత్రికి సీఎం రేవంత్ రెడ్డి
దిశ, వెబ్‌డెస్క్: తుంటి ఎముక మార్పిడి శస్త్రచికిత్స అనంతరం బీఆర్‌ఎస్ అధినేత, మాజీ సీఎం కేసీఆర్ కోలుకుంటున్నారు. శనివారం ఆయన ఆరోగ్య పరిస్థితి కాస్త మెరుగుపడింది. వైద్యులు వాకర్ సాయంతో ఆయనను నడిపించారు. ఈ సందర్భంగా డాక్టర్ ప్రవీణ్‌రావు మాట్లాడుతూ.. కేసీఆర్ ఆరోగ్య పరిస్థితి మెరుగ్గా ఉన్నదని చెప్పారు. ఇదిలా ఉండగా.. మాజీ సీఎం కేసీఆర్‌ను పరామర్శించేందుకు స్వయంగా రేవంత్ రెడ్డే రంగంలోకి దిగారు. ఆదివారం యశోద ఆసుపత్రికి వెళ్లనున్నారు. కేసీఆర్‌ను పరామర్శించి ఆరోగ్య పరిస్థితిపై డాక్టర్లను వివరాలు అడిగి తెలుసుకోనున్నారు. ఇప్పటికే మంత్రి పొన్నం ప్రభాకర్ ఆసుపత్రికి వెళ్లి పరామర్శించిన విషయం తెలిసిందే. ఎన్నికల ప్రచారంలో ఒకరిపై ఒకరు తీవ్ర విమర్శలు చేసుకున్న విషయం తెలిసిందే. రాజకీయాల్ని పక్కనబెట్టి ప్రతిపక్ష నేతను కలవాలని సీఎం రేవంత్ రెడ్డి తీసుకున్న నిర్ణయంపై పలువురు మేధావులు, రాష్ట్ర ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారు.