- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
ముస్లింలకు CM రేవంత్ రెడ్డి గుడ్ న్యూస్
దిశ, తెలంగాణ బ్యూరో: ముస్లింలకు 4 శాతం రిజర్వేషన్‌ను తప్పకుండా అమలు చేస్తామని సీఎం రేవంత్ రెడ్డి ప్రకటించారు. శుక్రవారం ఆయన ఎల్బీ స్డేడియంలో జరిగిన ఇఫ్తార్ విందులో పాల్గొన్నారు. ఈ సందర్భంగా సీఎం మాట్లాడుతూ.. కాంగ్రెస్ ప్రభుత్వం ముస్లిం, క్రిస్టియన్ మైనారిటీల అభివృద్ధికి కృషి చేస్తోందన్నారు. వైఎస్ రాజశేఖర్ రెడ్డి హయాంలో ముస్లింలకు 4 శాతం రిజర్వేషన్లను అమల్లోకి తెచ్చామన్నారు. కానీ ఇప్పుడు ముస్లింలకు 4 శాతం రిజర్వేన్లు రద్దు చేస్తామని మోదీ, అమిత్ షా అనడం విచిత్రంగా ఉన్నదన్నారు. ఇప్పుడు రద్దు చేయడం వాళ్లిద్దరి వళ్ల కాదని నొక్కి చెప్పారు.
కాంగ్రెస్ ప్రభుత్వంలో సంపూర్ణంగా ముస్లింలకు ప్రాధాన్యత ఇస్తామన్నారు. పాతబస్తీని అభివృద్ధి చేయడమే తమ లక్ష్యమని, త్వరలో సంపూర్ణమైన ప్రణాళికను ఓల్డ్ సిటీలో ప్రవేశపెడతామన్నారు. ఇక మైనారిటీ స్కూళ్లు, రెసిడెన్షియల్ భవనాల కోసం ప్రభుత్వం ఇప్పటికే నిధులు మంజురు చేసిందన్నారు. అద్దెభవనాల విధానం లేకుండా సంపూర్ణంగా సొంత భవనాల్లోనే మైనార్టీ స్కూళ్లు నిర్వహించేలా చొరవ చూపుతామన్నారు. ఈ కార్యక్రమంలో డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, ఎంపీ అసదుద్దీన్ ఓవైసీ, మైనార్టీ శాఖ అధికారులు పాల్గొన్నారు.