కేసీఆర్ చెప్పింది సీఎం రేవంత్ రెడ్డి చేస్తున్నారు : మల్లు రవి

by M.Rajitha |
కేసీఆర్ చెప్పింది సీఎం రేవంత్ రెడ్డి చేస్తున్నారు : మల్లు రవి
X

దిశ, వెబ్ డెస్క్ : హైదరాబాద్(Hyderabad) నగరంలోని చెరువులు, నాలలపై గల అక్రమ నిర్మాణాలను కూల్చివేతపై బీఆర్ఎస్ అనవసరపు రాద్దాంతం చేస్తుందని మంగళవారం కాంగ్రెస్ ఎంపీ మల్లు రవి(Mallu Ravi) ఆగ్రహం వ్యక్తం చేశారు. మంగళవారం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో మల్లు రవి మాట్లాడుతూ.. తాము అధికారమలోకి వస్తే మూసీ(Musi) నదిపై గల ఆక్రమాణలను, నగరంలోని చెరువులు, కుంటలపై గల ఆక్రమణలను తొలగిస్తామని బీఆర్ఎస్ నేత కేసీఆర్(KCR) తమ ఎజెండాగా చెప్పుకొని, ఇప్పుడు మాట మార్చారని పేర్కొన్నారు. పదేళ్ళ బీఆర్ఎస్ పాలనలో చేయనిది తొమ్మిది నెలల కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తుంటే కేటీఆర్, ఆ పార్టీ నాయకులు ఓర్వలేక పోతున్నారని మండి పడ్డారు. బీఆర్ఎస్ గతంలో ఆక్రమణల నిర్మూలన గురించి ప్రకటించింది అబద్దమని ఒప్పుకున్నట్లేనా అని సూటిగా ప్రశ్నించారు. చిన్నపాటి వర్షానికి కూడా నగరంలోని రోడ్లు, కాలనీలు జలమయం అవుతున్నాయని, నాలాల ఆక్రమణలు తొలగిస్తే ఆ నీరంతా సులభంగా నాలాల్లోకి వెళ్తుందని తెలియ జేశారు. మూసీ నది సుందరీకరణ చేస్తానని అప్పట్లో కేసీఆర్ ప్రకటించి, ఆ ప్రకటనను మూసిలో కలిపారని మల్లు రవి ఎద్దేవా చేశారు. 2016 లోనే నగరంలో ఉన్న ఆక్రమణలను పూర్తిగా నిర్మూలిస్తామని కేసీఆర్ ఘనంగా ప్రకటించారు కాని దానిని నిలబెట్టుకోలేదని అన్నారు. అప్పుడు కేసీఆర్ చెప్పింది ఇప్పుడు సీఎం రేవంత్ రెడ్డి(Revanth Reddy) చేసి చూపిస్తున్నారని వెల్లడించారు. గులాబీ నేతలు పేద ప్రజలను తప్పుదోవ పట్టిస్తున్నారని, తక్షణమే వారి నాటకాలను మానేయాలని ఆగ్రహం వ్యక్తం చేశారు. వారికి చిత్తశుద్ది ఉంటే ఆక్రమణల తొలగింపుకు ప్రభుత్వానికి సహాయపడాలని మల్లు రవి సూచించారు.

Next Story