- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
CM Revanth Reddy: గ్రూప్స్ ఉద్యోగాలపై సీఎం రేవంత్ కీలక ప్రకటన.. కేసీఆర్‌కు స్ట్రాంగ్ కౌంటర్
దిశ, వెబ్‌డెస్క్: అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్ఎస్(BRS)ను ఓడించి ఏం కోల్పోయారో ఈ పది నెలల్లో ప్రజలకు తెలుసుకున్నారని మాజీ సీఎం కేసీఆర్(KCR) వ్యాఖ్యానించిన విషయం తెలిసిందే. తాజాగా కేసీఆర్ వ్యాఖ్యలకు సీఎం రేవంత్ రెడ్డి(CM Revanth Reddy) కౌంటర్ ఇచ్చారు. సోమవారం అసిస్టెంట్ మోటార్ వెహికిల్ ఇన్ స్పెక్టర్లకు ఎల్బీస్టేడియంలో సీఎం రేవంత్ రెడ్డి నియామక పత్రాలు అందజేశారు. అనంతరం ఏర్పాటు చేసిన సమావేశంలో పాల్గొని మాట్లాడారు. పది నెలల్లో ఏం కోల్పోయారో ప్రజలకు అర్ధమైందని ఒకాయన మాట్లాడుతుండు.. మీ ఇంట్లో నలుగురు ఉద్యోగాలు కోల్పోయారు.. తప్ప తెలంగాణ ప్రజలు కోల్పోయిందేం లేదని కౌంటర్ ఇచ్చారు. ఈ పది నెలల్లో నిరుద్యోగులు ఉద్యోగాలు పొందారు, రైతులు రైతు రుణమాఫీ(Runa mafi)తో రుణ విముక్తులయ్యారు.
కోటి 5 లక్షల మంది మహిళలు ఆర్టీసీ(RTC) బస్సుల్లో ఉచిత ప్రయాణంతో లబ్ధి పొందారని అన్నారు. నష్టాల్లో కూరుకున్న ఆర్టీసీ లాభాల బాటలో పయనిస్తోందని తెలిపారు. 49 లక్షల 90 వేల కుటుంబాలు 200 యూనిట్ల ఉచిత విద్యుత్ వినియోగించుకుంటున్నారని గుర్తుచేశారు. రూ.500 లకే మా ఆడబిడ్డలు వంటగ్యాస్ సిలిండర్ అందుకోగలుగుతున్నారు. రాజీవ్ ఆరోగ్యశ్రీ(Aarogyasri) ద్వారా 10లక్షల వరకు ఉచిత వైద్యం అందుకోగలుగుతున్నారు. 21 వేల మంది టీచర్లు పదోన్నతులు పొందగలిగారని అన్నారు. 35 వేల మంది టీచర్ల బదిలీలు చేసిన ఘనత తమ ప్రజా ప్రభుత్వానిది అని సీఎం రేవంత్ రెడ్డి చెప్పుకొచ్చారు. కేసీఆర్ వాస్తు కోసం సచివాలయం, ప్రగతి భవన్ కట్టుకుండు కానీ.. రెసిడెన్షియల్ స్కూల్స్ నిర్మించలేదని విమర్శించారు.
తమ ప్రభుత్వం రాగానే 100 నియోజవర్గాల్లో యంగ్ ఇండియా రెసిడెన్షియల్ స్కూల్స్ నిర్మాణానికి శ్రీకారం చుట్టామని చెప్పారు. విద్యనే తెలంగాణ సమాజాన్ని నిర్మిస్తుందని నిరూపిస్తున్నామని ధీమా వ్యక్తం చేశారు. ఎన్ని అడ్డంకులు సృష్టించినా 563 గ్రూప్ ఉద్యోగాలకు విజయవంతంగా పరీక్షలు నిర్వహించామని అన్నారు. త్వరలో వారికి నియామకపత్రాలు అందించి.. వారిని తెలంగాణ పునర్నిర్మాణంలో భాగస్వాములను చేస్తామని కీలక ప్రకటన చేశారు. పది నెలల్లో రైతులు, నిరుద్యోగులను ఆదుకున్నాం, విద్యార్థులకు నాణ్యమైన విద్య అందిస్తున్నామని తెలిపారు.
తెలంగాణ పునర్నిర్మాణంలో భాగంగా ఇవన్నీ చేశాం.. మీరు లేకపోయినా ఏం బాధలేదు.. మీతో ప్రజలకేం పని లేదు.. తెలంగాణ సమాజం మిమ్మల్ని మరిచిపోయింది. ఇప్పటికైనా మీలో మార్పు రావాలి.. ప్రభుత్వం చేసే మంచి పనులకు మద్దతు ఇవ్వండి.. లోపాలు ఉంటే సలహాలు ఇవ్వండి.. బడి దొంగలను చూసాం కానీ.. ప్రతిపక్ష నాయకుడు అసెంబ్లీకి రాకుండా ఉన్న విచిత్ర పరిస్థితి తెలంగాణలో చూస్తున్నామని కేసీఆర్‌పై సీఎం రేవంత్ రెడ్డి తీవ్ర వ్యాఖ్యలు చేశారు.