- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
Revanth Reddy: క్రీడాకారులకు సీఎం రేవంత్ రెడ్డి గుడ్ న్యూస్
దిశ, డైనమిక్ బ్యూరో: 25 ఏళ్ల క్రితం క్రీడల్లో దేశానికే ఆదర్శంగా నిలిచిన హైదరాబాద్ ఇటీవల కాలంలో డ్రగ్స్, గంజాయికి హబ్ గా మారిందని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అన్నారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డాక బీఆర్ఎస్ పాలనలో క్రీడలను నిర్లక్ష్యం చేశారని విమర్శించారు. అందుకే రాబోయే రోజుల్లో తెలంగాణను స్పోర్ట్స్ హబ్ గా మార్చాలనే లక్ష్యంతో తమ ప్రభుత్వం పని చేస్తున్నదని చెప్పారు. గురువారం ఎల్బీ స్టేడియంలో ఢిల్లీలో రాష్ట్ర ప్రభుత్వ ప్రతినిధి జితేందర్ రెడ్డి, సాట్ ఛైర్మన్ శివసేనారెడ్డి సమక్షంలో 'చీఫ్ మినిస్టర్ కప్ -2024' లోగో, పోస్టర్ ను రేవంత్ రెడ్డి ఆవిష్కరించారు. ఈ సందర్భంగా రేవంత్ రెడ్డి మాట్లాడుతూ.. రాబోయే రోజుల్లో యంగ్ ఇండియా స్పోర్ట్స్ యూనివర్సిటీతో పాటు యంగ్ ఇండియా అకాడమీ మొదలు పెట్టి క్రీడాకారులకు శిక్షణ ఇస్తామని వెల్లడించారు. 2028 ఒలింపిక్స్ లో తెలంగాణ అథ్లెట్లు పతకాలు సాధించాలి. అందుకోసం కష్టపడాలని క్రీడాకారులకు పిలుపునిచ్చారు. తెలంగాణ అథ్లెట్లకు శిక్షణ ఇచ్చే బాధ్యతను ప్రభుత్వం తీసుకుంటుందన్నారు.
అండర్ -17 ఫుట్ బాల్ జట్టును దత్తత తీసుకున్నామన్నారు. యువత క్రీడల్లో రాణిస్తే గుర్తింపు ఉంటుందని చాటిచెప్పేందుకు నిబంధనలు సవరించి బాక్సర్ నిఖత్ జరీన్, మహ్మద్ సిరాజ్ కు పోలీసు ఉద్యోగాలు ఇచ్చామన్నారు. మట్టిలో మాణిక్యాలను వెలికితీయాల్సిన అవసరం ఉందని మాలావత్ పూర్ణ మన బిడ్డ మారుమూల నుంచి అద్భుతమైన ప్రతిభ కనబరిచారన్నారు. తెలంగాణ క్రీడాకారులను ఆర్థికంగా ఆదుకుంటామని భోరోసా ఇచ్చారు. క్రీడాకారులకు కాలేజీ అడ్మిషన్లలలో ఉద్యోగాలలో రిజర్వేషన్లు ఉంటాయని గుర్తు చేశారు. మతాలకు అతీతంగా దేశ ప్రతిష్టను పెంపొందించేది క్రీడాకారులేనని, త్వరలో ఎల్బీ స్టేడియంను అద్భుతంగా తీర్చిదిద్ది నగర క్రీడాకారులకు అందుబాటులోకి తీసుకువస్తామన్నారు. యవత వ్యసనాలు జోలికి వెళ్లవద్దు.. వ్యవసనాల వల్ల ఏం సాధించలేరన్నారు. ప్రధాని మోడీ కూడా పేద కుటుంబం నుంచే వచ్చారన్నారు. ఓటమి చూసి నిరాశ చెందవద్దని 2018లో కొడంగల్ ఎమ్మెల్యేగా పోటీ చేసి ఓడిపోయానని కానీ ఆ తర్వాత జరిగిన పార్లమెంట్ ఎన్నికల్లో మల్కాజిగిరి లోక్ సభస్థానంనుంచి గెలుపొందాను. ప్రస్తుతం సీఎంగా ఉన్నాను.