- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
‘మీ స్టాండ్ ఏంటో చెప్పండి’.. కేసీఆర్‌ను ఇరుకునపెట్టిన సీఎం రేవంత్
దిశ, వెబ్‌డెస్క్: రాజ్యాంగాన్ని మార్చాలని గతంలో కేసీఆర్ అన్నారు.. ఇప్పుడు రాజ్యాంగాన్ని మార్చడానికి బీజేపీ ప్రయత్నిస్తోందని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. బీజేపీ విధానంలోనే రాజ్యాంగాన్ని మార్చాలని అప్పుడు కేసీఆర్ అన్నారా అని ప్రశ్నించారు. రిజర్వేషన్లపై బీఆర్ఎస్ స్టాండ్ ఏంటో కేసీఆర్ ప్రకటించాలని సీఎం డిమాండ్ చేశారు. రిజర్వేషన్లపై బీఆర్ఎస్ విధానం ఏమిటో కేసీఆర్ స్పష్టం చేయాలన్నారు. హైదరాబాద్ జూబ్లీహిల్స్‌లోని తన నివాసంలో శనివారం ఆయన మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా రేవంత్ రెడ్డి మాట్లాడుతూ.. రాజ్యాంగాన్ని దెబ్బతీయాలని చూసే బీజేపీపై కేసీఆర్ పోరాటం ఏదని.. కేవలం మా ప్రభుత్వాన్ని కూల్చడానికే మీ కార్యాచరణా అని నిలదీశారు.
మీ ప్రతాపమంతా కాంగ్రెస్ ప్రభుత్వ 100 రోజుల పాలనపైనేనని.. కేంద్రంలోని పదేళ్ల బీజేపీ పాలనపై కనీసం ప్రశ్నించరా అని క్వశ్చన్ చేశారు. పార్లమెంట్ ఎన్నికల్లో తెలంగాణలో బీఆర్ఎస్ 5 సీట్లు బీజేపీకి తాకట్టు పెట్టిందని రేవంత్ రెడ్డి ఆరోపించారు. బీఆర్ఎస్, బీజేపీ ఒక్కటే అనడానికి మల్లారెడ్డి, ఈటల రాజేందర్ సంభాషణే నిదర్శనమని వ్యాఖ్యానించారు. బీజేపీతో చీకటి ఒప్పందం నిజం కాకపోతే మీ మేడ్చల్ ఎమ్మెల్యే మల్లారెడ్డిపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఈటల రాజేందర్‌ను కేసీఆర్, కేటీఆర్ ఎక్కడ విమర్శించరు ఎందుకని.. బీజేపీతో అగ్రిమెంట్‌లో భాగంగానే ఆయనపై ఎలాంటి విమర్శలు చేయరని ఆరోపించారు.
Read More..
భారత్‌ను పూర్తి హిందూ దేశంగా మార్చబోతున్నారు: CM రేవంత్ సెన్సేషనల్ కామెంట్స్