తెలంగాణను యూత్ స్కిల్ హబ్‌గా తీర్చిదిద్దుతాం’: CM రేవంత్ రెడ్డి సవాల్

by Anjali |   ( Updated:2024-08-26 08:21:38.0  )
తెలంగాణను యూత్ స్కిల్ హబ్‌గా తీర్చిదిద్దుతాం’: CM రేవంత్ రెడ్డి సవాల్
X

దిశ, వెబ్‌డెస్క్: యూత్ స్కిల్ హబ్‌గా తెలంగాణను తీర్చిదిద్దుతామని తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సవాల్ విసిరారు. రాష్ట్రంలో స్కిల్ యూనివర్సీటీ ఏర్పాట్ చేయనున్నట్లు సీఎం ఇప్పటికే ప్రకటించిన విషయం తెలిసిందే. యూత్‌ను ప్రపంచంలోనే మంచి నైపుణ్యం గలవారిగా మార్చాలనే లక్ష్యంతో సర్కారు ఈ కీలక నిర్ణయం తీసుకున్నట్లు రేవంత్ రెడ్డి వెల్లడించారు. ఈ యూనివర్సీటీ భవనానికి రంగారెడ్డి జిల్లా బ్యాగరికంచె వద్ద శంకుస్థాపన చేసినట్లు చెప్పుకొచ్చారు.

ఇందులో పదిహేడు రకాల కోర్సుల్లో ప్రతి సంవత్సరం 20 వేల మంది స్టూడెంట్స్‌కు శిక్షణ ఇచ్చి.. సర్టిఫికేట్ అందజేస్తామని తెలిపారు. అంతేకాకుండా పలు కంపెనీల్లో ఉద్యోగ ఉపాధి అవకాశాలు కూడా కల్పించేలా చూస్తూన్నామని అన్నారు. తెలంగాణ స్కిల్ యూనివర్సీటీ ఛాన్సలర్ గా గవర్నర్ లేదా సీఎం ఉంటారని బిల్లులో పేర్కొన్న విషయం తెలిసిందే. ఫ్యూచర్లో ఏడాదికి లక్ష మందికి శిక్షణ ఇచ్చే విధంగా స్కిల్ యూనివర్సిటీని విస్తరించనున్నట్లు సీఎం పేర్కొన్నారు.

తెలంగాణ రాష్ట్రంలో గంజాయి, డ్రగ్స్ గురించి ఎవరైనా ఆలోచన చేయాలన్న, నిద్రలో ఆ ఆలోచన వచ్చిన భయపడాల్సిన పరిస్థితి కల్పిస్తామన్నారు. అందుకే తెలంగాణ యాంటీ నార్కొటిక్స్ బ్యూరో, డీజీపీ కాడర్ ఆఫీస్‌తోని వందలాది మంది అధికారులను కేటాయించి ఒక ప్రత్యేకమైన ఆర్గనైజేషన్ మొదలుపెట్టి నేడు తెలంగాణ రాష్ట్ర మూల మూలన, ఈ గంజాయి మూలాలను, డ్రగ్స్ మూలాలను ఏరీవేసే కార్యక్రమాల్ని తీసుకుందామని సీఎం వెల్లడించారు. అలాగే యూత్ స్కిల్ హబ్‌గా తెలంగాణను తీర్చిదిద్దుతామని మరోసారి గుర్తు చేశారు.

Advertisement

Next Story

Most Viewed