CM Revanth Reddy: ప్రముఖ కంపెనీల ప్రతినిధులతో సీఎం బృందం భేటీ

by Ramesh Goud |
CM Revanth Reddy: ప్రముఖ కంపెనీల ప్రతినిధులతో సీఎం బృందం భేటీ
X

దిశ, డైనమిక్ బ్యూరో: తెలంగాణలో పెట్టుబడుల నిమిత్తం సీఎం రేవంత్ రెడ్డి సహా మంత్రులు, అధికారుల బృందం వీదేశీ పర్యటనలో ఉన్నారు. ఈ సందర్భంగా పలు కంపెనీల సీఈవోలను కలిసి రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టాలని ఆహ్వానిస్తున్నారు. ఈ నేపధ్యంలోనే కాలిఫోర్నియాలోని పాలో ఆల్టో వద్ద ప్రముఖ టెక్ కంపెనీ అడోబ్ సిస్టమ్స్ సీఈవో శంతన్ నారాయణ్ ను సీఎం బృందం కలిశారు. ఈ సందర్భంగా రేవంత్ రెడ్డి ఆయనకు శాలువా కప్పి సత్కరించారు. అనంతరం జరిగిన సమావేశంలో హైదరాబాద్ 4.0, యంగ్ ఇండియా స్కిల్ యూనివర్సిటీ అభివృద్దికి సహకరించాలని కోరారు. అంతేగాక ఏఐ, ఫ్యూచర్ సిటీ అభివృద్దికి మద్దత్తు ఇవ్వాలని మంత్రుల బృందం అడిగారు. దీనిపై శంతన్ నారాయణ్ సానుకూలంగా స్పందించారని, మా విజన్ కు మద్దతు ఇవ్వడానికి ఆయన ముందుకు వచ్చారని సీఎం రేవంత్ రెడ్డి తెలిపారు. అలాగే సిలికాన్ వ్యాలీలో అత్యంత గౌరవనీయమైన టెక్ విజనరీలలో శంతన్ నారాయణ్ ఒకరని, అంతేగాక హైదరాబాద్ నుంచి ప్రఖ్యాతి గాంచిన వ్యక్తులలో ఆయన కూడా ఒకడని గర్వంగా చెబుతానని అన్నారు.

అంతకుముందు సీఎం బృందం కాలిఫోర్నియాలోని యాపిల్ కంపెనీ ప్రతినిధులతో భేటీ అయ్యారు. ఈ సందర్భంగా కుపెర్టినోలోని ఆపిల్ కార్పొరేట్ ప్రధాన కార్యాలయమైన ఆపిల్ పార్క్‌ను సందర్శించడం జరిగిందని రేవంత్ రెడ్డి అన్నారు. వారితో జరిగిన సమావేశంలో 175 ఎకరాల విస్తీర్ణంలో ఉన్న క్యాంపస్ అనేక రంగాల్లో ప్రముఖ కంపెనీల పెట్టుబడులకు గమ్యస్థానంగా ఉందని, తెలంగాణ మరియు హైదరాబాద్ లో బలమైన పిచ్‌ని రూపొందించడానికి అనువైన ప్రదేశమని చెప్పారు. అలాగే ఐటీ శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు, సీనియర్ అధికారులతో సహా తన అధికారుల బృందం, కొత్త ఎలక్ట్రానిక్స్ పార్క్, స్కిల్స్ యూని వర్సిటీ, ఆర్టిఫిషియల్ ఇంటలిజెన్స్ సిటీ, ఫ్యూచర్ సిటీ, పబ్లిక్ పాలసీల గురించి ఆపిల్‌ ప్రతినిధులు, సీనియర్ ఎగ్జిక్యూటివ్‌లకు వివరించామని అన్నారు. ఈ సందర్భంగా అత్యంత ప్రోత్సాహకరమైన, స్నేహ పూర్వక చర్చలు జరిగాయని, ఈ చర్చలు తెలంగాణకు అనేక సానుకూల ఫలితాలు ఇచ్చేందుకు దారితీస్తాయని సీఎం రేవంత్ రెడ్డి విశ్వాసం వ్యక్తం చేశారు.

Advertisement

Next Story

Most Viewed