కేటీఆర్, ఈటలకి ఇదే నా సవాల్.. సీఎం రేవంత్ పవర్‌ఫుల్ స్పీచ్

by karthikeya |
కేటీఆర్, ఈటలకి ఇదే నా సవాల్.. సీఎం రేవంత్ పవర్‌ఫుల్ స్పీచ్
X

దిశ, వెబ్‌డెస్క్: బీఆర్ఎస్, బీజేపీ నాయకులకు, అందులోనూ స్పష్టంగా కేటీఆర్, హరీశ్‌రావు, ఈటల రాజేందర్‌కి తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి స్ట్రైట్ సవాల్ విసిరారు. ముగ్గురూ సెక్రటేరియట్‌కు రావాలని, తాను, ఉపముఖ్యమంత్రి భట్టి కూర్చుని.. అధికారులందరినీ పిలిపించి.. మూసీ ప్రక్షాళణ కోసం రూపొందించిన ప్రణాళికలన్నీ వారికి వివరిస్తామని, ఆ తర్వాత మూసీ నిర్వాసితులకు ఎలా న్యాయం చేయాలో వాళ్లే చెప్పాలని కోరారు. నష్టపరిహారం ఇవ్వాలా..? ప్రత్యామ్నాయంగా పక్కా ఇళ్లు కట్టించాలా..? లేదంటా మెరుగైన ఉపాధి అవకాశాలు కల్పించాలా..? పిల్లలకు మంచి పాఠశాలలు నిర్మించాలా..? ఎలాంటి ప్రత్యామ్నాయం ఇవ్వాలో వాళ్లే సూచించాలని సవాల్ విసిరారు. లేదంటే ఇలానే వదిలేసి మూసీని మూసేయాలంటారేమో కూడా చెప్పాలని కోరారు. కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత, కేంద్ర మాజీ మంత్రి జీ వెంకటస్వామి జయంతి సందర్భంగా రవీంద్రభారతిలో ఏర్పాటుచేసిన కార్యక్రమంలో సీఎం రేవంత్ రెడ్డి ఈ వ్యాఖ్యలు చేశారు.

అనంతరం బీజేపీ ఎంపీ ఈటల రాజేందర్‌కు సవాల్ విసురుతూ.. గుజరాత్‌లో 64 వేల కుటుంబాలను వేరే ప్రాంతాలకు తరలించి సబర్మతి రివర్ ఫ్రంట్‌ను నరేంద్ర మోడీ ఏర్పాటు చేసుకున్నారని, అందులో కేవలం 16 వేల మందికే నష్టపరిహారం ఇచ్చారని, అలాంటి గుజరాత్‌ మోడల్‌ అద్భుతమంటూ చప్పట్లు కొట్టే ఈటల రాజేందర్‌కి మన హైదరాబాద్‌లో మూసీ రివర్ ఫ్రంట్ కట్టుకుంటే వచ్చే కష్టమేంటి? నష్టమేంటని సీఎం రేవంత్ ప్రశ్నించారు. గత ప్రభుత్వంలో ఈటల రాజేందర్ మంత్రిగా ఉన్న సమయంలోనే మూసీ ఆక్రమణలను తొలగించానలి జీవో ఇచ్చారని, అప్పుడు అడ్డుకోని ఆయన ఇప్పుడెందుకు అడ్డుపడుతున్నారని నిలదీశారు.


Advertisement

Next Story

Most Viewed