CM Revanth: దొర చేతిలో మా అక్కలు చిక్కుకున్నరు: సీఎం రేవంత్ ఇంట్రెస్టింగ్ కామెంట్స్

by Shiva |
CM Revanth: దొర చేతిలో మా అక్కలు చిక్కుకున్నరు: సీఎం రేవంత్ ఇంట్రెస్టింగ్ కామెంట్స్
X

దిశ, వెబ్‌డెస్క్: సొంత చెల్లెల్ని పట్టించుకోని వాళ్లు కూడా రాజకీయాలు చేస్తున్నారని సీఎం రేవంత్‌రెడ్డి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఇవాళ అసెంబ్లీలో ఆయన మాట్లాడుతూ.. వార్డు మెంబర్‌గా గెలువలేని హరీష్‌రావును మంత్రిని చేసింది రాజశేఖర్‌రెడ్డి అని గుర్తు చేశారు. ఆనాడు కేసీఆర్‌కు సింగిల్ విండో పదవి ఇచ్చింది కాంగ్రెస్ పార్టీ అని అన్నారు. వాళ్ల నమ్మిన సొంత చెల్లెలే తిహార్ జైలులో ఉందని, ప్రస్తుతందొర చేతిలో అక్కలు చిక్కుకున్నారని సబితా ఇంద్రారెడ్డి, సునీతా లక్ష్మారెడ్డిని ఉద్దేశించి సీఎం రేవంత్ అన్నారు. ఓ దళితుడు స్పీకర్‌గా ఉన్నందుకే ప్రతిపక్ష నేత సభకు రావట్లేదా అని ప్రశ్నించారు. ప్రభుత్వాన్ని పని చేసుకోనివ్వకుండా బీఆర్ఎస్ నేతలు వ్యవహరిస్తున్నారని అన్నారు. మంత్రి సీతక్కపై అవమానకర రీతిలో మీమ్స్ పెడుతున్నారని ఆగ్రహం వ్యక్తి చేశారు. మైక్ ఇస్తే.. శాపనార్థాలు పెడుతున్నారని.. ఇవ్వకపోతే పోడియం ముందుకు ముందుకు వచ్చి ఆందోళన చేస్తున్నారని ఓ రేంజ్‌లో ఫైర్ అయ్యారు.

Advertisement

Next Story