సీఎం రేవంత్ నిశ్శబ్ధ విప్లవ నాయకుడు : ఎంపీ మల్లు రవి

by Mahesh |   ( Updated:2024-10-13 09:32:01.0  )
సీఎం రేవంత్ నిశ్శబ్ధ విప్లవ నాయకుడు : ఎంపీ మల్లు రవి
X

దిశ, వెబ్ డెస్క్: కాంగ్రెస్ ఎంపీ మల్లు రవి నెహ్రూ ఆలోచనలకు బీజేపీ దెబ్బకొట్టాలని చూస్తొందని విమర్శించారు. అలాగే మూసీ సుందరీకరణపై ఆయన మాట్లాడుతూ.. సీఎం రేవంత్ నిశ్శబ్ధ విప్లవ నాయకుడని, ప్రత్యామ్నాయం లేకుండా మూసీ సుందరీకరణ సాధ్యం కాదని మాకు తెలుసని అన్నారు. ఈ విషయంలో ప్రతిపక్షాల దగ్గర పాఠాలు నేర్చుకోవాల్సిన అవసరం లేదని, గత పాలకులు రూ.7 లక్షల కోట్లు అప్పు చేసి తెలంగాణకు ఏం చేశారో చెప్పాలని ప్రశ్నించారు. అభివృద్ధి క్రమంలో హైడ్రా, మూసీ వల్ల ప్రజలకు తాత్కాలికంగా ఇబ్బందులుంటాయని.. మూసీ ప్రక్షాళనతో హైదరాబాద్‌లో లక్షల మందికి లాభం జరుగుతుందరి నాగర్ కర్నూల్ కాంగ్రెస్ ఎంపీ మల్లు రవి ఆశాభావం వ్యక్తం చేశారు.

Advertisement

Next Story