- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
Telangana Decade celebrations : చప్పగా సార్ స్పీచ్.. దశాబ్ది వేడుకల్లో ఆకట్టుకోని సీఎం KCR ప్రసంగం!
దిశ, తెలంగాణ బ్యూరో: తెలంగాణ దశాబ్ది వేడుకల నేపథ్యంలో సెక్రటేరియట్‌లో జరిగిన మీటింగ్‌లో సీఎం కేసీఆర్ కొత్త విషయాలు చెబుతారని ప్రతి ఒక్కరూ ఆత్రుతగా ఎదురు చూశారు. కానీ ముఖ్యమంత్రి పాత విషయాలనే రిపీట్ చేసి అందర్నీ నిరాశ పర్చారనే చర్చ జరుగుతున్నది. ‘సార్ స్పీచ్‌లో పంచ్‌లు లేవు.. ప్రాసలూ లేవు. ప్రోగ్రామ్ మొత్తం బోర్ కొట్టింది’ అని వేడుకకు హాజరైన గులాబీ లీడర్లు ఒకరితో ఒకరు మాట్లాడుకున్నారు.
పొలిటికల్ కామెంట్స్ ఏవీ..?
సీఎం కేసీఆర్ సహజ శైలీకి భిన్నంగా దశాబ్ది వేడుకల ప్రారంభోత్సవ స్పీచ్ ఉన్నదనే చర్చ జరుగుతున్నది. గతంలో ఆయన పాల్గొన్న ప్రభుత్వ, పార్టీ కార్యక్రమాల్లో ఏదో ఒక రూపంలో రాజకీయ ప్రస్తావన తీసుకొచ్చేవారు. కొన్ని సార్లు నేరుగా, ఇంకొన్ని సార్లు సెటైర్‌గా విమర్శలు చేసిన సందర్భాలున్నాయి. కానీ ఈసారి ఏ పార్టీని పరోక్షంగానో, ప్రత్యక్షంగానో ఉద్దేశించి మాట్లాడక పోవడం ఆశ్చర్యానికి గురి చేస్తున్నది.
కర్ణాటక ఎన్నికల తర్వాత బీజేపీ ఊపు తగ్గిందని, కాంగ్రెస్ మంచి జోష్‌లో ఉందనే ప్రచారం జరుగుతున్నది. ఇలాంటి పరిస్థితుల్లో ఆ రెండు పార్టీలపై విమర్శలు చేయడం కంటే మౌనంగా ఉండాలనే ఉద్దేశంతో కేసీఆర్ రాజకీయాలు ప్రస్తావించలేదా? లేక ఆవిర్భావ వేడుకల సమయంలో రాజకీయాలు వద్దని మౌనంగా ఉన్నారా?అనే చర్చ జరుగుతున్నది.
నిరాశలో ఎంప్లాయిస్
సీఎం కేసీఆర్ స్పీచ్‌పై ఎంప్లాయిస్ ఎన్నో ఆశలు పెట్టుకున్నారు. పీఆర్సీ ఏర్పాటుపై సంకేతాలు ఇస్తారని ఎదురు చూశారు. కనీసం పెండింగ్‌లో ఉన్న డీఏలకైనా క్లియరెన్స్ ఇస్తారని భావించారు. కానీ సీఎం వాటి ఊసే ఎత్తలేదు. ఎన్నికల ముందు పార్టీ మేనిఫెస్టోలో కొత్త హామీలివ్వాలనే ఉద్దేశంతో ఇప్పుడు ఆ విషయాల గురించి ప్రస్తావించలేదని టాక్.