- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
ములాయాం సింగ్ అంత్యక్రియలకు కేసీఆర్
దిశ, తెలంగాణ బ్యూరో: సమాజ్‌వాదీ పార్టీ వ్యవస్థాపకులైన ఉత్తరప్రదేశ్ మాజీ సీఎం ములాయం సింగ్ ఆకస్మిక మృతి పట్ల తీవ్ర సంతాపం వ్యక్తం చేసిన తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ ఆయన అంత్యక్రియలకు మంగళవారం హాజరుకానున్నారు. యూపీలోని ఇట్టావా జిల్లా సైఫై గ్రామంలో జరిగే అంత్యక్రియలకు కేసీఆర్‌తో పాటు పలువురు టీఆర్ఎస్ నేతలు వెళ్తున్నారు. ములాయం సింగ్ మృతదేహానికి శ్రద్ధాంజలి ఘటించి నివాళులర్పించిన అనంతరం అంత్యక్రియల్లోనూ పాల్గొననున్నారు. మృతి వార్త తెలుసుకున్న వెంటనే కేంద్ర హోం మంత్ర అమిత్ షా గుర్గావ్‌లోని మేదాంత ఆస్పత్రికి వెళ్ళి సంతాపం వ్యక్తం చేశారు. సమాజ్‌వాదీ పార్టీ అధ్యక్షుడు అఖిలేష్ యాదవ్ సహా కుటుంబ సభ్యులను ఓదార్చారు.
ముఖ్యమంత్రి కేసీఆర్ సైతం సంతాపాన్ని వ్యక్తం చేశారు. సోషలిస్టు నాయకుడు రామ్ మనోహర్ లోహియా, స్వాతంత్ర్య సమరయోధులు రాజ్‌నారాయణ్ తదితరుల స్ఫూర్తిగా రాజకీయాల్లోకి వచ్చిన ములాయంసింగ్ జ్ఞాపకాలను కేసీఆర్ గుర్తుచేసుకున్నారు. దేశంలోనే అతి పెద్ద రాష్ట్రమైన ఉత్తరప్రదేశ్‌కు మూడుసార్లు ముఖ్యమంత్రిగా, పలుమార్లు కేంద్ర మంత్రిగా పనిచేసిన ములాయం సింగ్ తన చివరి శ్వాస వరకూ బడుగు, బలహీనవర్గాల సంక్షేమం కోసం పనిచేశారని కేసీఆర్ గుర్తుచేసుకున్నారు.