- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
Encounter: భారీ ఎన్‌కౌంటర్.. ఐదుగురు మావోయిస్టులు మృతి
X
దిశ, వెబ్‌డెస్క్/భద్రాచలం: ఛత్తీస్‌ఘడ్(Chhattisgarh)లోని నారాయణపూర్ జిల్లాలో భారీ ఎన్‌కౌంటర్(Encounter) జరిగింది. భద్రతా బలగాలు - మావోయిస్టులకు మధ్య శనివారం ఎదురుకాల్పులు చోటుచేసుకున్నాయి. ఈ ఎన్‌కౌంటర్‌లో ఐదుగురు మావోయిస్టులు(Maoists) మృతిచెందారు. మరికొందరికి తీవ్ర గాయాలు అయ్యాయి. ఇద్దరు జవాన్లకు సైతం తీవ్ర గాయాలు అయ్యాయి. టేకుమేట, కాకూర్ అటవీ ప్రాంతంలో ఈ ఎన్‌కౌంటర్ జరిగింది. ఘటనా స్థలంలో పోలీసులు భారీగా ఆయుధాలను స్వాధీనం చేసుకున్నారు. కాగా, ఇటీవల కాలంలో వరుసగా ఎదురుకాల్పులు చోటుచేసుకుంటున్నాయి. ఇవాళ్టి ఘటనతో మరోసారి ఛత్తీస్‌ఘడ్‌లో తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. ఎన్‌కౌంటర్‌కు సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
Advertisement
Next Story