Kumbam Anil: మూసీ సమస్యను రాజకీయం చేయొద్దు.. కిషన్ రెడ్డికి కాంగ్రెస్ ఎమ్మెల్యే రిక్వెస్ట్

by Gantepaka Srikanth |
Kumbam Anil: మూసీ సమస్యను రాజకీయం చేయొద్దు.. కిషన్ రెడ్డికి కాంగ్రెస్ ఎమ్మెల్యే రిక్వెస్ట్
X

దిశ, వెబ్‌డెస్క్: మూసీ(Musi) పరివాహక ప్రాంతాల్లో తెలంగాణ బీజేపీ(Telangana BJP) నిద్ర కార్యక్రమం చేపట్టిన విషయం తెలిసిందే. ఈ కార్యక్రమంపై కాంగ్రెస్ నేత, భువనగిరి ఎమ్మెల్యే కుంభం అనిల్ కుమార్ రెడ్డి(Kumbam Anil Kumar Reddy) స్పందించారు. శనివారం ఆయన మీడియాతో మాట్లాడారు. ఒక్కరోజు కాదు మూడు నెలలు మూసీ పరివాహక ప్రాంతాల్లో పర్యటించాలని కిషన్ రెడ్డి(Kishan Reddy)ని కోరారు. దయచేసి మూసీ సమస్యను రాజకీయం చేయొద్దని రిక్వెస్ట్ చేశారు. మూసీ ప్రక్షాళనకు కిషన్‌రెడ్డి నిధులు తీసుకురావాలని డిమాండ్ చేశారు. ఢిల్లీలో బీఆర్ఎస్‌, బీజేపీ దోస్తీ.. గల్లీలో మాత్రం కుస్తీ పట్టినట్టు నటిస్తారని సీరియస్ అయ్యారు.

కాగా, శనివారం సాయంత్రం 4 గంటల నుంచి ఆదివారం ఉదయం 9 గంటల వరకు కమలం పార్టీ నేతలు మూసీ పరివాహక ప్రాంతాల్లో బస చేయనున్నారు. మొత్తం 20 బస్తీల్లో 20 మంది నేతలు భాగస్వామ్యం కానున్నారు. ఆయా బస్తీల వారీగా పేదలు ఎదుర్కొంటున్న ఇబ్బందులను అడిగి తెలుసుకోనున్నారు. మూసీ పరివాహక ప్రాంత ప్రజలకు తామున్నామని భరోసా ఇవ్వనున్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం మూసీ ప్రక్షాళన పేరుతో పేదల ఇండ్లు కూల్చివేయడాన్ని బీజేపీ తీవ్రంగా వ్యతిరేకిస్తోంది. ఈ బస్తీ నిద్ర కార్యక్రమంలో కార్పొరేటర్లు, స్థానిక నాయకులు 8 జిల్లాలకు సంబంధించి బీజేపీ జిల్లా అధ్యక్షులు పాల్గొననున్నారు.

Advertisement

Next Story