తెలంగాణలో మోడీ.. ఢిల్లీ టూర్‌కు కేసీఆర్ ప్లాన్?

by samatah |   ( Updated:2022-11-10 08:48:50.0  )
తెలంగాణలో మోడీ.. ఢిల్లీ టూర్‌కు కేసీఆర్ ప్లాన్?
X

దిశ, డైనమిక్ బ్యూరో: ముఖ్యమంత్రి కేసీఆర్ మరోసారి ఢిల్లీ టూర్ ప్లాన్ చేస్తున్నట్టు తెలుస్తోంది. రేపు ఆయన హస్తినకు వెళ్లే అవకాశాలు ఉన్నాయని ప్రచారం జరుగుతోంది. ఓ వైపు రామగుండం ఫర్టిలైజర్స్ అండ్ కెమికల్స్ లిమిటెడ్‌ను జాతికి అంకితం ఇచ్చేందుకు ప్రధాని నరేంద్ర మోడీ ఈ నెల 12 తెలంగాణకు వస్తుండగా అంతకు ముందే రేపు కేసీఆర్ ఢిల్లీకి వెళ్తారని తెలుస్తోంది. ఈ నేపథ్యంలో గురువారం అందుబాటులో ఉన్న మంత్రులు, పార్టీ నేతలతో ప్రగతి భవన్‌లో సమావేశమైనట్టు సమాచారం. మునుగోడు ఉప ఎన్నిక పోరు ముగియడంతో కేసీఆర్ ఇక బీఆర్ఎస్ పై ఫోకస్ పెట్టారు. భారత్ రాష్ట్ర సమితి పార్టీ పేరు విషయంలో ఎవరికైనా అభ్యంతరాలు ఉంటే తెలపాలంటూ టీఆర్ఎస్ పార్టీ తరపున పబ్లిక్ నోటీసును సైతం జారీ చేశారు. ఈ నేపథ్యంలో నవంబర్ నెలలో బీఆర్ఎస్ పై పూర్తి స్తాయిలో ఫోకస్ పెట్టే ఛాన్స్ ఉందని తెలుస్తోంది. ఇందులో భాగంగా రేపు సాయంత్రం లేదా ఎల్లుండి కేసీఆర్ తన టీమ్ తో కలిసి ఢిల్లీకి వెళ్తారనే తెలుస్తోంది.

కేసీఆర్ వెంట పలువురు మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు సైతం హస్తినకు వెళ్లనున్నట్లు సమాచారం. వచ్చే నెల 9న ఢిల్లీలో రైతులతో భారీ ఎత్తున సభ లేదా నిరసన కార్యక్రమం నిర్వహించాలనే యోచనలో కేసీఆర్ ఉన్నట్టు రాజకీయ వర్గాల్లో ప్రచారం జరుగుతోంది. ఆ ఏర్పాట్లతో పాటు బీఆర్ఎస్ పార్టీకి వివిధ పార్టీల మద్దతుతో పాటు కేంద్ర ప్రభుత్వ విధానాలకు వ్యతిరేకంగా కొంత కాలంగా తాను చేస్తున్న పోరాటానికి ఆయా పార్టీల నేతలను కలిసి వారి మద్దతు కూడగట్టే అవకాశాలు ఉన్నాయి. వారం రోజులు అక్కడే ఉండి ఈ పనులన్ని చూసుకోబోతున్నట్టు టాక్ వినిపిస్తోంది. ఎమ్మెల్యేల కొనుగోలు విషయాన్ని జాతీయ స్థాయిలోకి తీసుకువెళ్లి బీజేపీని టార్గెట్ చేయాలని భావిస్తున్న కేసీఆర్.. ఆమ్ ఆద్మీ పార్టీతో పాటు ఇతర ప్రాంతీయ పార్టీలతో కలిసి ఎదైనా ఉమ్మడి కార్యక్రమం ప్లాన్ చేస్తారా అనేది ఆసక్తిగా మారింది. గత నెలలో ఢిల్లీకి వెళ్లిన కేసీఆర్ అక్కడే వారం రోజుల పాటు ఉన్నారు. ఆ సమయంలో బీఆర్ఎస్, టీఆర్ఎస్ పార్టీ కార్యాలయాలను పరిశీలించిన కేసీఆర్ జాతీయ స్థాయిలో నేతలెవరినీ కిలిసినట్టుగా కానీ అధికారికంగా కేంద్ర పెద్దలతో కానీ భేటీ అయినట్టు బయటకు సమాచారం రాలేదు. దాంతో సీఎం కేసీఆర్ టూర్ పై ప్రతిపక్షాల నుంచి విమర్శలు వ్యక్తం అయ్యాయి. ఈ నేపథ్యంలో తాజాగా ఢిల్లీ లిక్కర్ స్కామ్ దర్యాప్తు, టీఆర్ఎస్ మంత్రులపై ఈడీ, ఐటీ సోదాలు ప్రస్తుతం రాష్ట్రంలో హాట్ టాపిక్ గా మారాయి. ఇదిలా ఉండగా ప్రధాని రాష్ట్రానికి వస్తుంటే కేసీఆర్ రాష్ట్రాన్ని వీడుతున్నారనే ప్రచారం ఆసక్తిగా మారింది.

ఇవి కూడా చదవండి: ముఖ్య అనుచరులతో నేడు తుమ్మల భేటీ.. టీఆర్ఎస్‌కు షాక్ తప్పదా?

Advertisement

Next Story

Most Viewed