- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
ఆ స్కీమ్‌ను MS స్వామినాథన్ ప్రశంసిస్తే.. కాంగ్రెస్ వేస్ట్ అంటోంది: సీఎం కేసీఆర్ ఫైర్
దిశ, వెబ్‌డెస్క్: కాంగ్రెస్ పార్టీపై సీఎం కేసీఆర్ మరోసారి నిప్పులు చెరిగారు. శుక్రవారం పాలేరులో నిర్వహించిన ప్రజా ఆశీర్వాద సభలో కేసీఆర్ మాట్లాడుతూ.. గతంలో ఏ పాలకులు కూడా రైతులకు రూపాయి ఇవ్వలేదన్నారు. కానీ బీఆర్ఎస్ అధికారంలోకి వచ్చాక రైతు బంధును పుట్టించి.. రైతులకు ఎదురు డబ్బులు ఇస్తున్నామన్నారు. తెలంగాణ ప్రభుత్వం రైతుల కోసం తీసుకొచ్చిన రైతు బంధు స్కీమ్‌ను హరితవిప్లవ పితమహుడు, ప్రముఖ శాస్త్రవేత్త ఎంఎస్ స్వామినాథన్ ప్రశంసించారని కేసీఆర్ పేర్కొన్నారు. అలాంటి రైతు బంధు స్కీమ్ దండగ అని కాంగ్రెస్ పార్టీ నేతలు అంటున్నారని.. రైతు బంధు ఉండాలో.. వద్దో ప్రజలే నిర్ణయించుకోవాలని అన్నారు.
కాంగ్రెస్ పార్టీ గెలిస్తే.. రైతు బంధుకు రాంరాం.. దళితబంధుకు జైభీమ్ అంటారన్నారు. రైతు బంధు, 24 గంటల కరెంట్ వద్దు అనే కాంగ్రెస్ పార్టీని వచ్చే ఎన్నికల్లో ఓడించాలని కేసీఆర్ పిలుపునిచ్చారు. మద్యం, డబ్బు కట్టలతో ప్రజలను కొంటామనే వారికి ప్రజలే బుద్ధి చెప్పాలన్నారు. పదవుల కోసం పూటకో పార్టీ మారే వారు మన మధ్యే ఉన్నారని.. డబ్బు కట్టలు, మద్యం సీసాలతో వచ్చే వారిని నమ్మకండని సూచించారు. ఖమ్మం జిల్లా ప్రజలు చైతన్యవంతులని.. డబ్బు, మద్యంతో వచ్చే వారికి కాకుండా.. పార్టీల వైఖరిని పరిశీలించి ఓటు వేయాలని కోరారు.