చాలా విషయాల్లో తెలంగాణ నెంబర్ వన్ గా ఉంది.. CM KCR

by Javid Pasha |   ( Updated:2023-06-09 13:12:38.0  )
చాలా విషయాల్లో తెలంగాణ నెంబర్ వన్ గా ఉంది.. CM KCR
X

దిశ, వెబ్ డెస్క్: దేశంలో చాలా విషయాల్లో తెలంగాణ రాష్ట్రం నెంబర్ వన్ గా ఉందని సీఎం కేసీఆర్ అన్నారు. మంచిర్యాల జిల్లాలో నూతనంగా నిర్మించిన సమీకృత జిల్లా కలెక్టరేట్ భవన సముదాయాన్ని సీఎం కేసీఆర్ శుక్రవారం ప్రారంభించారు. ప్రత్యేక పూజలు నిర్వహించిన ఆయన అనంతరం ఛాంబర్‌లో కలెక్టర్‌ను కూర్చోబెట్టి అభినందనలు తెలియజేశారు. అనంతరం సీఎం కేసీఆర్ మాట్లాడుతూ.. తెలంగాణ రాష్ట్రం దేశంలో అనేక విషయాల్లో నెంబర్ వన్ గా ఉందని తెలిపారు. సాగు నీరు, తాగునీరు, ఇతర సంక్షేమ కార్యక్రమాల్లో రాష్ట్రం ఇతర రాష్ట్రాలకు రోల్ మోడల్ గా ఉందని అన్నారు. కంటి వెలుగు పథకాన్ని ఢిల్లీ, పంజాబ్ రాష్ట్రాలు ఆదర్శంగా తీసుకున్నాయని చెప్పారు. కులం, మతం అనే తారతమ్యాలు లేకుంగా ప్రతి ఒక్కరి సంక్షేమం కోసం కృషి చేస్తున్నామని సీఎం స్పష్టం చేశారు. అలాగే తలసారి ఆదాయంలో తెలంగాణ ముందుందన్నారు. ఆరున్నర సంవత్సరాల క్రితం నాటి ప్రణాళికలు ఇప్పుడు కార్యరూపం దాలుస్తున్నాయన్నారు. కేంద్రం పది అవార్డులు ఇస్తే అందులో 9 తెలంగాణకే వస్తున్నాయని అన్నారు.

రెండేళ్లు కరోనా ప్రజలను అతలాకుతలం చేసిందని కేసీఆర్ ఆవేదన వ్యక్తం చేశారు. రెండో విడత గోర్రెల పంపకాన్ని మంచిర్యాల నుంచే ప్రారంభించనున్నట్లు తెలిపారు. కరోనా ఇబ్బందులను సైతం ఎదుర్కొని అభివృద్ధిలో ముందుకు సాగామని కేసీఆర్ వెల్లడించారు. కుల మతాలకు అతీతంగా సంక్షేమ పథకాలను అందజేస్తున్నామని సీఎం తెలిపారు. గొర్రెల పెంపకంలో తెలంగాణ ముందంజలో ఉందన్నారు. కులవృత్తుల వారికి ఆసరాగా నిలుస్తున్నామని సీఎం తెలిపారు. ఇకపోతే.. మంచిర్యాల జిల్లా పర్యటన సందర్భంగా రూ.60 లక్షలతో నిర్మించిన బీఆర్ఎస్ పార్టీ కార్యాలయాన్ని కేసీఆర్ ప్రారంభించారు. పార్టీ జెండాను ఆవిష్కరించిన ముఖ్యమంత్రి.. మంచిర్యాల జిల్లా బీఆర్ఎస్ అధ్యక్షుడు, ప్రభుత్వ విప్ బాల్క సుమన్‌ను కుర్చీలో కూర్చోబెట్టారు.

Read more:

కేసీఆర్‌ను నమ్మని విపక్ష నేతలు? తేదీ మారినా అందని ఆహ్వానం

బడ్జెట్​లేక మూలనపడ్డ సంక్షేమం.. దళితబంధు ఎంపికలో అంతా దగే

అనూహ్యంగా వ్యూహం మార్చిన కేసీఆర్.. బలం పుంజుకుంటోదనే భయం

Advertisement

Next Story

Most Viewed