ఖమ్మం సభలో కేసీఆర్ సంచలన ప్రకటన

by GSrikanth |   ( Updated:2023-01-18 13:09:05.0  )
ఖమ్మం సభలో కేసీఆర్ సంచలన ప్రకటన
X

దిశ, వెబ్‌డెస్క్: ఖమ్మంలో నిర్వహించిన బహిరంగ సభలో ముఖ్యమంత్రి కేసీఆర్ కీలక వ్యాఖ్యలు చేశారు. దేశంలో రాబోయేది విపక్షాల ప్రభుత్వమే అని జోస్యం చెప్పారు. విపక్షాలు అధికారంలోకి వచ్చాక దేశ వ్యాప్తంగా ఉచిత కరెంట్ అందజేస్తామని హామీ ఇచ్చారు. ప్రగతి సూచికలలో విద్యుత్ రంగం అత్యంత కీలకమైనది, మొదటిది అని, విద్యుత్ రంగాన్ని ఖచ్చితంగా పబ్లిక్ సెక్టార్‌లోనే ఉంచాలని డిమాండ్ చేస్తున్నామని అన్నారు. అదే బీఆర్ఎస్‌ పాలని అని కూడా స్పష్టం చేశారు. అంతేగాకుండా దళితబంధును దేశ వ్యాప్తంగా అమలు చేయాలని మోడీ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. రాజకీయాల్లో గెలుపు ఓటములు సహజమని అన్నారు. దేశంలో ఎవరిని అడుక్కునే అవసరం లేనటువంటి సహజ సంపద ఈ దేశ ప్రజల సొత్తు అని కేసీఆర్‌ అన్నారు. దేశంలో లక్షల కోట్ల కోట్ల ఆస్తి ఉందని, ఇదంతా ఏమైతుంది అని ప్రశ్నించారు. దేశంలో సంపద లేకుంటే బిక్షం ఎత్తుకుంటే తప్పులేదు. కానీ ఉండి మనం ఎందుకు యాచకులం కావాలని ప్రశ్నించారు. బీజేపీ ప్రభుత్వ తెలివిలేని పోకడల వల్ల దేశం మరింత వెనుకబాటుకు గురవుతోందని అన్నారు.

Read More... అగ్నిపథ్‌ స్కీమ్‌ను రద్దు చేస్తాం: సీఎం కేసీఆర్ కీలక వ్యాఖ్యలు

కేసీఆర్ ఖమ్మం సభలో కనిపించని ఆ ఇద్దరు!

Advertisement

Next Story

Most Viewed