- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
కోకాపేటలో భారత్ భవన్‌కు సీఎం కేసీఆర్ శంకుస్థాపన
దిశ,వెబ్‌డెస్క్: హైదరాబాద్ కోకాపేట్‌కు వెళ్లిన సీఎం కేసీఆర్ భారత్ భవన్‌కు శంకుస్థాపన చేశారు. అక్కడ అతిపెద్ద డిజిటల్ లైబ్రరీ ఏర్పాటు చేయబోతున్నారు. 15 అంతస్థుల భవన నిర్మాణం చేపట్టనున్నారు. 11 ఎకరాల స్థలంలో భవనం నిర్మాణం చేపడుతున్నారు. భారత్ భవన్ సెంటర్ ఫర్ ఎక్స్‌లెన్స్ & HRDగా ఆ భవనానికి నామకరణం చేశారు. కోకాపేటలో అత్యంత విలువైన భూమిని కేవలం ఐదు రోజుల్లోనే భూ కేటాయింపు చేస్తూ నిర్ణయం తీసుకోవడం ఇప్పుడు చర్చనీయాంశమైంది.
భారత్ భవన్ సెంటర్ ఫర్ ఎక్స్‌లెన్స్ అండ్ హెచ్ఆర్డీ భవనంలో అతి పెద్ద డిజిటల్ లైబ్రరీని ఏర్పాటు చేయనున్నారు. స్టేట్ ఆర్ట్ కాన్ఫరెన్స్ హాల్, డిజిటల్ లైబ్రరీతో పాటు ఇక్కడ శిక్షణ పొందేవారికి, పనిచేసే సిబ్బందికి సదుపాయాలు కల్పించనున్నారు. భారత్ భవన్ నిర్మాణం పూర్తయిన తర్వాత కేసీఆర్ అక్కడి నుంచే పార్టీ కార్యకలాపాలను పర్యవేక్షించనున్నట్లు సమాచారం.