- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
BRS విస్తరణపై ఫోకస్.. కేసీఆర్‌కు సలహాలు ఇచ్చేది ఎవరో తెలుసా?
దిశ, తెలంగాణ బ్యూరో: అన్ని రాష్ట్రాల్లో ఎంట్రీ కోసం కేసీఆర్ చేరికలపై ఫోకస్ పెట్టారు. మాజీ ప్రజాప్రతినిధులే ఎజెండాగా ముందుకు సాగుతున్నారు. గతంలో కీలకంగా వ్యవహరించి ప్రస్తుతం ఆయా పార్టీల్లో ప్రాధాన్యత తగ్గిన వారితో మంతనాలు చేసి బీఆర్ఎస్ కండువా కప్పుతున్నారు. ఇప్పటికే పలువురు నేతలతో సంప్రదింపులు జరిపారు. కొందరి మాజీలకు గులాబీ కండువాను కప్పివారినే ఆయా రాష్ట్రాలకు పార్టీ బాధ్యతలను అప్పగిస్తున్నారు గులాబీ బాస్.
దేశంలోని అన్ని రాష్ట్రాల్లో బీఆర్ఎస్ను విస్తరించడమే లక్ష్యంగా పెట్టుకున్న కేసీఆర్.. అక్కడి మాజీ ప్రజాప్రతినిధులపైనే టార్గెట్ పెట్టారు. ఆయా రాష్ట్రాల్లో ఏ మేరకు ప్రభావం అని చూపుతారని కాకుండా ఆ రాష్ట్రాల్లో ఎంట్రీ కోసమే మొదటి అడుగు వేస్తున్నారు. బీఆర్ఎస్కు ప్రతినిధిగా ఎవరో ఒకరు ఉండాలన్నదే లక్ష్యంగా ముందుకు సాగుతున్నారు. అందుకోసం మాజీలను ప్రత్యేకంగా పిలిపించుకొని ప్రగతిభవన్లోనే భేటీ అవుతున్నారు. వారికి దారి ఖర్చులను సైతం కేసీఆర్ భరిస్తుండటం గమనార్హం. వారితో పాటు రైతుసంఘం నేతలతోనూ గతంలోనే సంప్రదింపులు చేయడంతో తెలంగాణలో జరుగుతున్న రైతు సంక్షేమాన్ని క్షేత్రస్థాయి పర్యటనలో చూపించారు. ఇప్పటివరకు గుజరాత్ మాజీ సీఎం శంకర్ సింగ్ వాఘేలా, మహారాష్ట్ర మాజీ సీఎం శరద్ పవర్, మాజీ పీఎం దేవేగౌడ, కర్ణాటక మాజీ సీఎం కుమారస్వామి, మాజీ ఎంపీ ఉండవల్లి అరుణ్ కుమార్, ఒడిషా మాజీ సీఎం గిరిధర్ గమాంగ్, మహారాష్ట్ర మాజీ ఎంపీ ఛత్రపతి శంభాజీ రాజే, ఏపీ మాజీ మంత్రి రావెల కిషోర్ బాబు, మాజీ ఐఏఎస్ తోట చంద్రశేఖర్, మాజీ ఐఆర్ఎస్ చింత పార్థసారధితో పాటు 25 రాష్ట్రాల రైతుసంఘం నేతలతో సంప్రదింపులు చేశారు. బీఆర్ఎస్ నినాదం, సిద్ధాంతాలను వివరించారు.
కొందరికీ గులాబీ కండువాలు
కాంగ్రెస్, బీజేపీకి ప్రత్యామ్నాయమే బీఆర్ఎస్ పార్టీ స్థాపన అంటూ కేసీఆర్ ప్రకటిస్తూ ఆ దిశగానే దేశ రాజకీయాల్లో ముందుకు సాగుతున్నారు. ఏపీకి చెందిన మాజీ మంత్రి రావెల కిశోర్ బాబు, మాజీ ఐఏఎస్ తోట చంద్రశేఖర్, మాజీ ఐఆర్ఎస్ పార్థసారధిలకు గులాబీ కండువా కప్పారు. అంతేకాదు చంద్రశేఖర్‌కు ఏపీ బాధ్యతలు అప్పగించారు. తాజాగా ఒడిషా మాజీ సీఎం గిరిధర్ గమాంగ్‌తో పాటు ఆ రాష్ట్రానికి చెందిన మాజీ మంత్రులు, మాజీ ఎంపీలు, మాజీ ఎమ్మెల్యేలను సైతం బీఆర్ఎస్లోకి ఆహ్వానించారు. ఫిబ్రవరి 5న మహారాష్ట్ర నాందేడులో నిర్వహించే సభలో సైతం మాజీ సీఎంలు, మాజీ ఎంపీలు, మాజీ ఎమ్మెల్యేలు చేరనున్నట్లు పార్టీ వర్గాలు పేర్కొంటున్నాయి. వారు ఆయా రాష్ట్రాల్లో ఏ మేరకు ప్రభావం చూపుతారనేది కాకుండా ఆ రాష్ట్రంలో ప్రాతినిధ్యమే లక్ష్యంగా కేసీఆర్ ముందుకు సాగుతున్నారు.
ప్రగతిభవన్ వేదికగా...
బీఆర్ఎస్ విస్తరణకు ప్రగతిభవన్ వేదికైంది. అక్కడి నుంచే పార్టీ బలోపేతంపై నిత్యం చర్చలు జరుపుతున్నారు. మాజీ ఐఏఎస్, సుప్రీం, హైకోర్టు జడ్జీలతో పాటు ఇతర రాష్ట్రాలకు చెందిన సీనియర్ నాయకులు, రాజకీయ వేత్తల సూచనలు, సలహాలు స్వీకరిస్తున్నారు. ఇతర రాష్ట్రాల్లో ఏ నినాదంతో ముందుకు వెళ్లాలి, అక్కడి సమస్యలు ఏమిటీ, ప్రజలకు కావల్సిన మౌలిక వసతులు ఏమిటీ అనే వివరాలను సైతం సేకరిస్తున్నారు. అదే విధంగా తెలంగాణలోని ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలను ఎలా వారి ముందుకు తీసుకెళ్లాలనే అంశాలపైనా చర్చిస్తున్నారు.