ఏడాది తర్వాత రాజ్ భవన్ గడప తొక్కనున్న కేసీఆర్.. ఎందుకంటే..?

by Satheesh |   ( Updated:2023-07-22 11:18:54.0  )
ఏడాది తర్వాత రాజ్ భవన్ గడప తొక్కనున్న కేసీఆర్.. ఎందుకంటే..?
X

దిశ, తెలంగాణ బ్యూరో: సీఎం కేసీఆర్ ఆదివారం రాజ్ భవన్‌కు వెళ్లనున్నారు. తెలంగాణ రాష్ట్ర హైకోర్టు నూతన ప్రధాన న్యాయమూర్తిగా నియామకమైన అలోక్ ఆరాదే రేపు ప్రమాణ స్వీకారం చేయనున్నారు. ఈ కార్యక్రమానికి హాజరయ్యేందుకు సీఎం రాజ్ భవన్‌కి వెళ్లనున్నారు. కాగా, గత ఏడాది తెలంగాణ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి ఉజ్జల్ భుయాన్ ప్రమాణ స్వీకారం సందర్భంగా రాజ్ భవన్‌కు వెళ్లిన కేసీఆర్.. ఆ తర్వాత మళ్లీ ఇప్పటివరకు రాజ్ భవన్‌ గడప తొక్కలేదు. రాజ్ భవన్‌కు, రాష్ట్ర ప్రభుత్వానికి మధ్య గత కొంతకాలంగా వైరం నడుస్తోన్న విషయం తెలిసిందే. దీంతో అప్పటి నుండి కేసీఆర్ రాజ్ భవన్‌కు వెళ్లలేదు. దాదాపు 13 నెలల తర్వాత రేపు ఉదయం 11 గంటలకు మాత్రం హైకోర్టు చీఫ్ జస్టిస్ ప్రమాణ స్వీకార కార్యక్రమానికి సీఎం హాజరుకానున్నారు.

Advertisement

Next Story