- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
పేద విద్యార్థుల కడుపులు ఎండబెడుతున్న సీఎం కేసీఆర్ : వైఎస్సార్ టీపీ చీఫ్ షర్మిల
కనీసం పచ్చడి మెతుకులకు కూడా పాఠశాలల్లో దిక్కులేదు
దిశ, తెలంగాణ బ్యూరో : సీఎం కేసీఆర్ పేద విద్యార్థుల కడుపులు ఎండబెడుతున్నాడని వైఎస్సార్ తెలంగాణ పార్టీ అధ్యక్షురాలు షర్మిల శనివారం ట్విట్టర్ వేదికగా విమర్శలు చేశారు. కనీసం పచ్చడి మెతుకులకు కూడా పాఠశాలల్లో దిక్కు లేదని ఆమె ఆగ్రహం వ్యక్తం చేశారు. మధ్యాహ్న భోజన పథకంలో గుడ్డు, బ్రెడ్డు, పప్పు, పాయసంతో కొత్త మెనూ అంటూ ఊదరగొట్టిన సీఎం ఆచరణలో మాత్రం విఫలమయ్యారని ఫైరయ్యారు. దొర రాజకీయాలకు, జల్సాలకు నిధులు ఉంటాయి కానీ.. పేద పిల్లల మధ్యాహ్న భోజన కష్టాలు తీర్చేందుకు చేతులు రావట్లేదా అంటూ ప్రశ్నించారు. విద్యార్థులు ఓటర్లు కాకపోవడం వల్లే సీఎం కేసీఆర్ వారిని చిన్నచూపు చూస్తున్నారని ఎద్దేవా చేశారు. కొత్త విద్యా సంవత్సరం ప్రారంభమై రెండు వారాలు గడుస్తున్నా.. విద్యార్థులకు మధ్యాహ్న భోజనం పూర్తి స్థాయిలో అందడం లేదని ఆమె ధ్వజమెత్తారు. ఇప్పటికైనా విద్యార్థులకు మంచి భోజనం పెట్టాలని, అలాగే మధ్యాహ్న భోజన కార్మికుల సమస్యలు పరిష్కరించాలని ఆమె డిమాండ్ చేశారు.
Also Read..
కాంగ్రెస్‌లో YSRTP విలీనానికి బ్రేక్.. షర్మిల రాకను అడ్డుకుంటున్న హస్తం కీలక నేత..?