బీఆర్ఎస్‌లోకి ఇద్దరు కీలక నేతలు.. పార్టీలోకి ఆహ్వానించిన CM KCR

by Sathputhe Rajesh |   ( Updated:2023-10-31 09:08:10.0  )
బీఆర్ఎస్‌లోకి ఇద్దరు కీలక నేతలు.. పార్టీలోకి ఆహ్వానించిన CM KCR
X

దిశ, వెబ్‌డెస్క్: కాంగ్రెస్ పార్టీకి చెందిన ఇద్దరు ముఖ్య నేతలు బీఆర్ఎస్ పార్టీలో చేరారు. తెలంగాణ భవన్ లో సీఎం కేసీఆర్ సమక్షంలో జూబ్లీహిల్స్ మాజీ ఎమ్మెల్యే విష్ణువర్ధన్ రెడ్డి, ఉమ్మడి మహబూబ్ నగర్ కాంగ్రెస్ కీలక నేత, మాజీ మంత్రి నాగం జనార్ధన్ రెడ్డి బీఆర్ఎస్ పార్టీలో చేరారు. వారికి సీఎం కేసీఆర్ పార్టీ కండువా కప్పి కారు పార్టీలోకి ఆహ్వానించారు. ఈ సందర్భంగా సీఎం కేసీఆర్ మాట్లాడుతూ.. 1969 ఉద్యమంలో నాగం జనార్ధన్ రెడ్డి జైలుకు వెళ్లారన్నారు. దివంగత నేత పీజేఆర్‌ తనకు వ్యక్తిగత మిత్రుడని విష్ణువర్ధన్ రెడ్డి భవిష్యత్తు తన బాధ్యత అన్నారు. నాగం జనార్ధన్ రెడ్డి, విష్ణువర్ధన్ రెడ్డి, జైపాల్ రెడ్డిని తానే పార్టీలోకి ఆహ్వానించానన్నారు. పాత కొత్త నేతలు కలిసి ముందుకు సాగాలన్నారు.

Advertisement

Next Story

Most Viewed