సీఎం ప్రయివేట్ సెక్రటరీ రిక్రూట్‌మెంట్ జీవో లీక్ చేసింది ఎవరు?

by GSrikanth |   ( Updated:2023-05-07 03:04:45.0  )
సీఎం ప్రయివేట్ సెక్రటరీ రిక్రూట్‌మెంట్ జీవో లీక్ చేసింది ఎవరు?
X

కేసీఆర్ సర్కారును ఎప్పడూ ఎదో ఓ టెన్షన్ వెంటాడుతూనే ఉంటున్నది. తాజాగా మహరాష్ట్రకు చెందిన బీఆర్ఎస్ నేత శరద్ మర్కడ్‌ను కేసీఆర్ ప్రయివేట్ సెక్రటరీగా నియమిస్తూ సీఎస్ జీవో జారీ చేశారు. ఈ జీవోను ఆన్‌లైన్‌లో ఉంచకుండా ప్రభుత్వం జాగ్రత్త తీసుకున్నది. కానీ రెండు రోజులకే ఆ కాపీ బయటకు రావడంతో ప్రగతిభవన్ వర్గాలు షాక్ తిన్నాయి. అది కాస్త ప్రతిపక్షాల చేతికి చిక్కడంతో వారి నుంచి విమర్శలు మొదలయ్యాయి. జాగ్రత్తలు పాటించినా జీవో కాపీ ఎలా బయటకు వచ్చిందనేది సస్పెన్స్‌గా మారింది. ఈ విషయం సీఎం కేసీఆర్ అసహనం వ్యక్తం చేస్తున్నట్టు సమాచారం. మరి కాపీ ఎక్కడి నుంచి లీకైందనే విషయంపై అధికారులు ఆరా తీస్తున్నారు.

దిశ, తెలంగాణ బ్యూరో: మహరాష్ట్రకు చెందిన బీఆర్ఎస్ నేత శరద్ మర్కడ్‌ను సీఎం కేసీఆర్‌కు పర్సనల్ సెక్రటరీగా నియమించారు. ఆయనకు నెలకు రూ.లక్షన్నర వేతనం అదిస్తున్నట్టు ఈనెల 2వ తేదీన జోవో జారీ అయింది. ఆ విషయం బయటకు తెలియకుండా జాగ్రత్తపడ్డారు. జీవో కాపీని ఆన్‌లైన్‌లోనూ పెట్టలేదు. అంత వరకు బాగానే ఉన్నా.. రెండు రోజుల అనంతరం ఆ జీవో కాపీ టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి చేతికి చేరింది. ఈ విషయంపై మీడియాతో మాట్లాడిన ఆయన ఆ జీవో కాపీని బయటపెట్టారు. దీంతో ప్రగతిభవన్ వర్గాలు ఒక్క సారిగా షాక్ అయినట్టు సమచారం. సీక్రెట్‌గా ఉంచిన జీవో కాపీ ఎలా బయటకు విషయంలో అధికారులు ఆరా తీయడం మొదలుపెట్టినట్టు తెలుస్తున్నది.

ఎక్కడి నుంచి లీక్?

శరద్ మర్కడ్‌ను సీఎం పీఎస్‌గా నియమించాలని నిర్ణయం తీసుకోవడం, ఆ మేరకు ఉత్తర్వుల జారీ సమాచారం కేవలం రెండు ఆఫీసులకు మాత్రమే తెలుసు. అందులో ఒకటి సీఎం ఆఫీసు కాగా, మరొకటి సీఎస్ కార్యాలయం. జీవో కాపీని సీక్రెట్‌గా ఉంచాలని ఆదేశాలు జారీ అయినా.. ఆ కాపీ రేవంత్ రెడ్డికి చేరడంపై అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఈ రెండు ఆఫీసుల ద్వారే జీవో కాఫీ రేవంత్ రెడ్డికి చేరే చాన్స్ ఉంటుందని ప్రగతిభవన్‌ వర్గాలు డౌట్ పడుతున్నట్టు సమాచారం. ఈ రెండు ఆఫీసుల్లో ఎవరు లీక్ చేశారు? ఎందుకు లీకు చేశారు? గతంలోనూ ఇలా ఎప్పుడైనా జరిగిందా? అనే కోణంలో అధికారులు ఆరా తీస్తున్నట్టు తెలిసింది.

మహారాష్ట్ర వాట్సాప్ గ్రూపుల్లో..

తెలంగాణ సీఎం కేసీఆర్ తనను ప్రయివేట్ సెక్రటరీగా నియమించుకున్నారనే ఆనందంతో బీఆర్ఎస్ నేత మర్కడ్ ఆ విషయాన్ని తన వారితో పంచుకున్నారని, అందులో భాగంగానే ఆయన ఆ జీవో కాపీని వాట్సాప్ గ్రూపుల్లో షేర్ చేయడంతో విషయం బయటకు వచ్చింది, జీవో కాపీ లీక్ అయిందన్న వాదనలూ వ్యక్తమవుతున్నాయి. మరి ఎక్కడి నుంచి లీక్ అయిందనే విషయం ఇంకా సస్పెన్స్‌గా ఉన్నది.


ఇవి కూడా చదవండి:

సచివాలయంపై గరుడ సంచారం.. శుభమా?.. అరిష్టమా?

కాంగ్రెస్‌కు ఓటేయండి.. బీజేపీ దోపిడిని అంతం చేయండి: సోనియా గాంధీ

ఓరుగ‌ల్లుపై బీజేపీ ఫోక‌స్‌.. భారీగా చేరిక‌ల‌కు ప్లాన్‌..!

Advertisement

Next Story