బిగ్ న్యూస్: అసెంబ్లీ ఎన్నికలకు 70 మంది BRS అభ్యర్థుల లిస్ట్ రెడీ.. KCR మాస్టర్ ప్లాన్..?

by Satheesh |   ( Updated:2023-06-06 06:15:07.0  )
బిగ్ న్యూస్: అసెంబ్లీ ఎన్నికలకు 70 మంది BRS అభ్యర్థుల లిస్ట్ రెడీ.. KCR మాస్టర్ ప్లాన్..?
X

దిశ, తెలంగాణ బ్యూరో: ఎన్నికల షెడ్యూల్ వచ్చేలోపే పార్టీలోని పరిస్థితులు అన్నీ సెట్ అయిపోవాలని గులాబీ బాస్ భావిస్తున్నారు. ఇప్పటికే టికెట్ల విషయంలో కసరత్తు మొదలుపెట్టిన ఆయన.. దశాబ్ది ఉత్సవాల అనంతరం సుమారు 70 మంది అభ్యర్థులతో మొదటి జాబితాను ప్రకటించనున్నట్టు సమాచారం. ఇప్పటికే చేయించిన పలు సర్వేల ఆధారంగా లిస్టు రెడీ చేసినట్టు తెలుస్తున్నది. ఇక త్వరలోనే వాటిని ఫైనల్ చేసి అనౌన్స్ చేస్తారని తెలిసింది.

ఎన్నికల షెడ్యూలు వచ్చేలోపే అభ్యర్థులను ప్రకటించి ప్రచారానికి తెరలేపాలనే యోచనలో కేసీఆర్ ఉన్నట్టు టాక్. 2018 అసెంబ్లీ ఎన్నికల సమయంలో అసెంబ్లీ రద్దు, అభ్యర్థుల ప్రకటన ఒకే రోజు జరిగింది. ఈసారి కూడా అదే వ్యూహంతోనే పార్టీ అభ్యర్థులను కేసీఆర్ ప్రకటించనున్నట్టు తెలుస్తున్నది. సెప్టెంబరులో ఈసీ ఎన్నికల షెడ్యూలును ప్రకటించే చాన్స్ ఉంది. అంతలోపే అభ్యర్థుల ఎంపిక ఫైనల్ కావాలనే నిర్ణయానికి గులాబీ బాస్ వచ్చినట్టు ప్రగతి భవన్ వర్గాల సమాచారం.

సిట్టింగులతో ఫేస్ టు ఫేస్..

దశాబ్ది వేడుకలు ముగిసిన తర్వాత ఎమ్మెల్యేలతో ముఖాముఖి భేటీలు నిర్వహించి.. ఎవరికి టికెట్ వస్తుంది? ఎవరిని పక్కన పెడుతున్నాం అనే విషయంలో క్లారిటీ ఇవ్వనున్నట్టు సమాచారం. నిజానికి ఆరునెలల ముందుగానే టికెట్లు ప్రకటిస్తానని గతంలోనే కేసీఆర్ పలు సార్లు ప్రకటించారు. అందుకు అనుగుణంగానే కసరత్తును ఆయన తీవ్రం చేశారు.

పార్టీ వీడినా డోంట్ కేర్?

వీలైనంత త్వరగా అభ్యర్థులను ప్రకటిస్తే టికెట్ దక్కని వారని బుజ్జగించేందుకు టైం ఉంటుందని భావిస్తున్నారు. చివరి నిమిషంలో టికెట్లు ప్రకటిస్తే, టికెట్ రాని సిట్టింగ్‌లు, టికెట్ ఆశించి భంగపడ్డ లీడర్లతో ఎలక్షన్ టైమ్‌లో పార్టీకి నష్టం చేకూరుతుందని ఆలోచిస్తున్నట్టు తెలుస్తున్నది.

అభ్యర్థులను ముందే ప్రకటిస్తే టికెట్ రాని వారిని బుజ్జగించవచ్చని, నచ్చని వారు ఇతర పార్టీలోకి వెళ్లినా ఫర్వాలేదనే నిర్ణయానికి గులాబీ బాస్ వచ్చినట్టు తెలుస్తున్నది. ఓ వైపు ప్రతిపక్ష పార్టీలతో ఫైటింగ్, మరోవైపు అసమ్మతి లీడర్లతో పేచీలు ఇబ్బందుల పాలు కావొద్దనే అభిప్రాయంతో సీఎం ఉన్నారని ప్రగతిభవన్‌కు సన్నిహితంగా ఉన్న ఓ లీడర్ కామెంట్ చేశారు.

వివాదాలు లేని సెగ్మెంట్లే ఫస్ట్

వివాదాలు లేని సెగ్మంట్లలో ముందుగా అభ్యర్థులను ప్రకటించాలని సీఎం భావిస్తున్నారు. సిట్టింగులను పక్కన పెట్టే అవకాశం ఉన్న చోట్ల కొత్త అభ్యర్థులను ప్రకటించేందుకు మరికొంత సమయం తీసుకునే అవకాశాలు ఉన్నాయి. రెండో దఫాలో కొత్త అభ్యర్థులను ప్రకటిస్తారని ప్రచారం జరుగుతున్నది. శ్రావణ మాసంలో ఇదంతా పూర్తయ్యే చాన్స్ ఉన్నట్టు తెలుస్తున్నది.

Advertisement

Next Story