- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
జాతీయ రాజకీయాలపై KCR ప్లాన్ చేంజ్.. ఆ వార్తలకు మరింత అనుమానం పెంచేలా KTR కామెంట్స్?
దిశ, డైనమిక్ బ్యూరో: జాతీయ రాజకీయాల్లో చక్రం తిప్పుతానంటూ బీఆర్ఎస్ పార్టీని ప్రారంభించిన సీఎం కేసీఆర్ తాజాగా తన వ్యూహం మార్చుకున్నారా? నేషనల్ పాలిటిక్స్‌లోకి తలదూర్చి లేనిపోని తలనొప్పులను తెచ్చుకోవడం కంటే తన రాష్ట్రంపై ఫోకస్ పెట్టడమే ముఖ్యమని భావిస్తున్నారా? తాజాగా ఆ పార్టీ అనుసరిస్తున్న తీరు గమనిస్తే అవుననే సమాధానమే వస్తోంది. గత కొంత కాలంగా బీజేపీ, నరేంద్ర మోడీ పేరు చెబితేనే చిటపటలాడిపోతున్న కేసీఆర్ బీజేపీకి వ్యతిరేక కూటమిలో కలిసేందుకు మాత్రం తర్జనభర్జన పడుతున్నారు.
వచ్చే ఎన్నికల్లో మోడీ ప్రభుత్వాన్ని ఇంటికి పంపిస్తామని ప్రకటనలు చేస్తున్నా.. ఆచరణలో మాత్రం అందుకు భిన్నంగా వ్యవహరిస్తున్నారనే టాక్ వినిపిస్తోంది. ఇటీవల ఆయన విపక్ష పార్టీలతో కలవకపోవడం హాట్ టాపిక్‌గా మారుతోంది. నూతన పార్లమెంట్ భవనం ప్రారంభోత్సవాన్ని వ్యతిరేకిస్తూ 19 పార్టీలు ఉమ్మడి లేఖను విడుదల చేయగా వాటిలో బీఆర్ఎస్ పేరు లేదు. ఆ తర్వాత ఈ విషయంలో తన వైఖరి ఏంటో చెప్పకుండానే పార్లమెంట్ భవనం ప్రారంభోత్సవానికి దూరంగా ఉండటం రాజకీయ వర్గాలను ఆశ్చర్యపరిచింది.
పాట్నా మీటింగ్ స్కిప్:
2024 ఎన్నికల్లో బీజేపీని ఓడించడమే లక్ష్యంగా జూన్ 12వ తేదీన బిహార్‌లో నితీష్ కుమార్ ఆధ్వర్యంలో జరగబోతున్న విపక్షాల మీటింగ్‌కు బీఆర్ఎస్ దూరంగా ఉండాలని నిర్ణయించింది. నితీష్ కుమార్ చేస్తున్న ప్రయత్నాలతో తాము చేతులు కలపడం లేదని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మంత్రి కేటీఆర్ మీడియా చిట్ చాట్‌తో వెల్లడించారు. బీజేపీపై జరుగుతున్న పోరాటంలో ప్రతిపక్షాల ఐక్యతపై తమ పార్టీకి నమ్మకం లేదన్నారు. రాష్ట్రాన్ని బట్టి రాజకీయ పరిస్థితులు మారుతున్నందున థర్డ్ ఫ్రంట్, ఫోర్త్ ఫ్రంట్‌లు ఇప్పుడు పని చేయవనేది తమ పార్టీ విశ్వసిస్తోందని అందువల్ల ఈ మీటింగ్‌కు తాము హాజరుకావడం లేదని చెప్పారు.
ఆహ్వానానికి ముందే ఆమడదూరం:
అయితే విపక్షాల కూటమి విషయంలో బీఆర్ఎస్ అనుసరిస్తున్న తీరు ఆసక్తిగా మారింది. నిజానికి ఈ మీటింగ్‌కు రావాల్సిందిగా బీఆర్ఎస్‌కు ఆహ్వానం అందలేదని.. ఇన్విటేషన్ రాకముందే మీటింగ్‌కు దూరంగా ఉంటున్నామని కేటీఆర్ చెప్పడం వెనుక బీజేపీ విషయంలో బీఆర్ఎస్ వైఖరిపై సందేహాలు వ్యక్తం అవుతున్నాయనే చర్చ రాజకీయ వర్గాల్లో జరుగుతోంది. గతంలో కీలకమైన బిల్లుల విషయంలో నరేంద్ర మోడీ ప్రభుత్వ నిర్ణయాలను కేసీఆర్ పార్టీ సమర్ధించింది.
ఆ తర్వాత మారిన రాజకీయ ప్రయోజనాల నేపథ్యంలో కేసీఆర్ యూ టర్న్ తీసుకున్నారు. ప్రస్తుతం బీజేపీకి వ్యతిరేకంగా మెజార్టీ విపక్ష పార్టీలు ఏకం అవుతుంటే బీఆర్ఎస్ మాత్రం అంటిముట్టనట్టుగా వ్యవహరించడం రాజకీయ వర్గాల్లో చర్చకు దారి తీస్తోంది. దీంతో నేషనల్ పాలిటిక్స్ విషయంలో కేసీఆర్ తన వ్యూహం మార్చుకున్నారా అనే చర్చ జరుగుతోంది.
Also Read..
CM కేసీఆర్‌కు ఆ పని చేసే దమ్ముందా..? ఆవిర్భావ దినోత్సవ వేళ బండి సంజయ్ సంచలన వ్యాఖ్యలు