- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- రాశి ఫలాలు
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- రాశి ఫలాలు
- కెరీర్
CM KCR: అబిడ్స్‌లో కేసీఆర్ స్పీచ్ ఎక్స్‌పెక్ట్ చేసిన ప్రజలు
దిశ ప్రతినిధి, హైదరాబాద్: CM KCR Attends National Anthem Program at Abids| సామూహిక జాతీయ గీతాలాపనలో భాగంగా ముఖ్యమంత్రి కేసీఆర్ మంగళవారం అబిడ్స్ చౌరస్తాలో జరిగిన కార్యక్రమంలో పాల్గొన్నారు. ముందుగా నిర్ణయించిన ప్రకారం 11:30 గంటలకు మూడు నిమిషాల ముందే సీఎం ఆబిడ్స్ చేరుకున్నారు. చౌరస్తాలో ఉన్న పండిట్ జవహర్ లాల్ నెహ్రూ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం చౌరస్తాలో ఏర్పాటు చేసిన వేదిక నుండి జాతీయ గీతాన్ని ఆలపించారు. ఈ కార్యక్రమానికి జనగాం జిల్లా నుండి సుమారు వంద మందికి పైగా మహిళలు బోనాలు ఎత్తుకొని హాజరయ్యారు. సీఎం వెంట పలువురు మంత్రులు, అధికారులు ఉన్నారు. సుమారు ఐదు నిమిషాల సమయం మాత్రమే సీఎం ఆబిడ్స్‌లో ఉన్నారు. అయితే, వేదిక నుండి సీఎం కేసీఆర్ ప్రసంగం ఉంటుందని అందరూ భావించినప్పటికీ, ఎలాంటి స్పీచ్ ఇవ్వకుండానే ముఖ్యమంత్రి కేసీఆర్ అక్కడినుంచి వికారాబాద్ బయలుదేరారు.
ఇది కూడా చదవండి: KTR ఎప్పటికీ సీఎం కాలేడు.. Kishan Reddy కీలక వ్యాఖ్యలు