- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- రాశి ఫలాలు
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- రాశి ఫలాలు
- కెరీర్
మంత్రులపై సీఎం కేసీఆర్ గుస్సా
దిశ, తెలంగాణ బ్యూరో: మంత్రులపై సీఎం కేసీఆర్ గుర్రుగా ఉన్నారు. ప్రతి మంత్రి కి జిల్లా ఇన్‌చార్జి బాధ్యతలు అప్పగించినప్పటికీ వారంతా నియోజకవర్గానికే పరిమితం అయ్యారు. ఇతర నియోజకవర్గాలపై ఆశించిన స్థాయిలో దృష్టి సారించకపోవడం, ఎన్నికల గడువు సమీపిస్తున్నప్పటికీ సొంత నియోజకవర్గానికే ప్రియార్టీ ఇస్తుండడంతో కేసీఆర్ ఆగ్రహం వ్యక్తం చేశారు. అన్ని జిల్లాల్లో ని నియోజకవర్గాల్లో సైతం అసంతృప్తులు ఉన్నప్పటికీ వారిని శాంతపర్చడంలో విఫలమవుతున్నారని మందలించినట్లు సమాచారం.
సొంత నియోజకవర్గాలకే ప్రియార్టీ
మంత్రులకు జిల్లా ఇన్‌చార్జి బాధ్యతలను బీఆర్ఎస్ అధినేత, సీఎం కేసీఆర్ అప్పగించారు. జిల్లాలో అభివృద్ధి, సంక్షేమ బాధ్యతలను అప్పగించారు. అన్ని నియోజకవర్గాల్లో పార్టీ యాక్టివ్ కార్యక్రమాలను నిర్వహించాలని కేసీఆర్ పలుమార్లు ఆదేశించారు. నిత్యం ప్రజల్లో ఉండేలా కార్యక్రమాలు చేపడుతూ కేడ ర్‌ను ఎన్నికలను సన్నద్ధం చేయాలని సూచించారు. ప్రాతినిధ్యం వహిస్తున్న నియోజకవర్గాలకే పరిమితం కాకుండా జిల్లా మొత్తం పర్యటించాలని అధినేత ఆదేశాలు ఇచ్చారు.
ఎన్నికలు దగ్గరపడుతున్న మంత్రులు వారి సొంత నియోజకవర్గాలకే ప్రియారిటీ ఇస్తున్నారు. నిత్యం ఆ నియోజకవర్గాల్లోనే పర్యటిస్తూ పలు కార్యక్రమాలు చేపడుతున్నారు. మిగతా నియోజకవర్గాల్లో అడపాదడపా పర్యటనలు చేస్తుండటంతో కేసీఆర్ అసంతృప్తి వ్యక్తం చేసినట్లు సమాచారం. జిల్లాను మేనేజ్ చేయనివారు మంత్రిగా ఎలా బాధ్యతలను రాష్ట్రం లో నిర్వర్తిస్తారని ప్రశ్నించినట్లు విశ్వసనీయ సమాచారం. పనితీరును మార్చుకోవాలని సూచించారు.
కేసీఆర్ అసహనం
ఎన్నికలు సమీపిస్తుండటంతో రాష్ట్రం లోని విపక్షాలు యాక్టివ్ అవుతున్నాయి. కానీ బీఆర్ఎస్ నేతలు ఆ స్థాయిలో ముందుకు సాగకపోవడంతో కేసీఆ ర్ గుర్రుగా ఉన్నట్లు సమాచారం. కేవలం అభివృద్ధి, సంక్షేమ పథకాలను మాత్రమే నమ్ముకున్నప్పటికీ వాటిని సైతం ఆశించిన స్థాయిలో ప్రజల్లోకి తీసుకెళ్లడం లేదని అధినేత దృష్టికి వచ్చినట్లు సమాచారం. మంత్రులకు సైతం జిల్లా బాధ్యతలను అప్పగించినప్పటికీ నియోజకవర్గాల్లో కేడర్‌ను యాక్టివ్ చేయకపోవడంతో అసహనం వ్యక్తం చేసినట్లు తెలిసింది.
పెండింగ్ పనుల పూర్తిపై సైతం నేతలు దృష్టి సారించకపోవడం, సంక్షేమ పథకాల లబ్ధిదారుల ఎంపిక సరిగ్గా చేయకపోవడం, ప్రభుత్వంపై ప్రజల్లో వ్యతిరేకతను తగ్గించకపోవడం తదితర వివరాలను సేకరించిన అధినేత... నోటిఫికేషన్ వచ్చేలోగా పెండింగ్ పనులు పూర్తి చేయాలని ఆదేశించినట్లు సమాచారం. అందుకోసం మంత్రులు ప్రత్యేక ప్రణాళికలతో ముందుకు సాగాలని, అలక్ష్యం వహించొద్దని సూచించినట్లు సమాచారం.
తీరు మార్చుకోండి..
అసెంబ్లీ ఎన్నికలకు టికెట్లను ఆశించి భంగపడ్డ ఆశావహులు అధిష్టానంపై వ్యతిరేకతతో ఉన్నారు. వారిని శాంతిపజేసే బాధ్యతను ఆయా జిల్లా మంత్రులకే పార్టీ అధినేత కేసీఆర్ అప్పగించారు. అయితే వారితో సరిగ్గా డీల్ చేయకపోవడం, హామీలను ఇచ్చి శాంతింప చేయకపోవడంతో కారు దిగుతున్నారు. అందులో భాగంగానే మాజీ మంత్రి తుమ్మల నాగేశ్వర్ రావు, మాజీ ఎమ్మెల్యే ఆరెపల్లి మోహన్, మాజీ మంత్రి కృష్ణ యాదవ్, కేసీఆర్ సన్నిహితుడు కూచాడి శ్రీహరి రావు, మాజీ ఎమ్మెల్యే వేముల వీరేశం, మాజీ కార్పొరేషన్ చైర్మన్ మందుల సామేల్ ఇలా పలువురు రాజీనామా చేస్తుండటంతో కేసీఆర్ సీరియస్ అయినట్లు తెలిసింది.
పార్టీని వీడకుండా చర్యలు చేపట్టడంలో విఫలమవుతున్నారని ఆరా తీస్తూ మంత్రులపై గరం అవుతున్నట్లు విశ్వసనీయ సమాచారం. నేతలు పార్టీని వీడకుండా కట్టుదిట్టమైన చర్యలు తీసుకోవాలని, పార్టీని వీడితే రాబోయే ఎన్నికల్లో నష్టం జరుగుతుందని అలా కాకుండా ప్రణాళికలు రూపొందించుకోవాలని మంత్రులకు హెచ్చరికలు జారీ చేసినట్లు విశ్వసనీయ సమాచారం. మంత్రులు ఇప్పటికైనా తీరు మార్చుకోని జిల్లా బాధ్యతలను సక్రమంగా నిర్వర్తించాలని ఆదేశించినట్లు సమాచారం.