- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
రాష్ట్రంలో ఎవరైన భూములు అమ్మాలనుకుంటే కురుమ సోదరులకు అమ్మాలి: సీఎం రేవంత్ రెడ్డి
దిశ, వెబ్ డెస్క్: హైదరాబాద్ నగరంలోని కోకాపేటలో రాష్ట్ర ప్రభుత్వం నిర్మించిన దొడ్డి కొమురయ్య కురుమ భవనాన్ని శనివారం సాయంత్రం సీఎం రేవంత్ రెడ్డి ప్రారంభించారు. ఈ కార్యక్రమానికి హరియాణా గవర్నర్ బండారు దత్తాత్రేయ హాజరయ్యారు. ఈ సందర్భంగా అక్కడే ఏర్పాటు చేసిన భారీ బహిరంగ సభలో సీఎం మాట్లాడుతూ కీలక వ్యాఖ్యలు చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. తెలంగాణ రాష్ట్రంలో కురుమ సోదరులు ఎవరికి హాని తలపెట్టలేని మంచి మనసున్న వారు అని కొనియాడారు. అలాగే సాయుధ రైతాంగ పోరాటంలో దొడ్డి కొమురయ్య చేసిన విరోచిత పోరాటాన్ని గుర్తు చేశారు. అలాగే దుడ్డు సంఘం పోరాటంతో.. దళితులు, పీడిత వర్గాలకు న్యాయం చేశారని చెప్పుకొచ్చారు. అలాగే నా కురుమ సోదరుల పిల్లలు గతంలో మాదిరిగా.. గొర్రెలు, బర్రెలు పెంచడం, చేపలు పట్టడం వంటి పాత పనులు కాకుండా.. అన్ని రంగాల్లో రాణిస్తూ.. కురుమల పిల్లలు డిగ్రీలు, పీజీలు చేసి.. ప్రభుత్వ ఉద్యోగాలతో పాటు ప్రైవేట్ ఉద్యోగాల్లో రాణించాలని.. ఇందుకోసం కాంగ్రెస్ ప్రభుత్వం అన్ని విధాలుగా చర్యలు తీసుకుంటుందని.. కురుమ సోదరులకు ప్రభుత్వం అండగా ఉంటుందని ఈ సందర్భంగా సీఎం రేవంత్ రెడ్డి హామీ ఇచ్చారు.
అలాగే తెలంగాణ రాష్ట్రంలో ఎవరైనా తమ భూములను అమ్మాలనుకుంటే కురుమ సోదరులకు అమ్మాలని.. వారు మాత్రమే నిజాయితిగా డబ్బును నడుముకు కట్టుకొని తీసుకొచ్చి భూమిని కొనుగోలు చేస్తారని చెప్పుకొచ్చారు. అలాగే ఇప్పటికే 98 శాతం కులగణన పూర్తయిందని, మిగిలిన రెండు శాతం పూర్తవ్వగానే.. కురుమ కులానికి సంబంధించిన పూర్తి సమాచారం వస్తుందని, ఆ తర్వాత కురుమ కులస్తులకు అన్ని రకాలుగా.. శాసన సభలో సముచిత స్థానం కల్పిస్తామని ఈ సందర్భంగా సీఎం రేవంత్ రెడ్డి హామి ఇచ్చారు. కాంగ్రెస్ ప్రభుత్వం కురుమలకు పెద్దపీట వేస్తుందని.. ఈ క్రమంలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే.. మొదటి సారి ఎమ్మెల్యే అయిన బీర్ల ఐలయ్యకు ప్రభుత్వ విప్ పదవి ఇచ్చామని కొనియాడారు. అలాగే బీర్ల ఐలయ్య విప్ గా ఉండటం వల్లనే.. నేడు రాష్ట్ర ప్రభుత్వం మొత్తం.. కోకాపేటలో ఉందని తెలిపారు. అలాగే కురుమలకు సామాజిక న్యాయం జరగాలంటే.. రాజకీయంగా అవకాశం వచ్చిన వారు ఎక్కడున్నా గెలిపించుకోవాలని, అలా జరిగినప్పుడే కురుమ జాతి బాగుపడుతుందని సీఎం రేవంత్ రెడ్డి తెలిపారు. అలాగే తెలంగాణ రాష్ట్రంలో దొడ్డి కొమురయ్య పేరు శాశ్వతంగా నిలిచిపోయేల ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందని కురుమ సంఘం నేతలకు సీఎం హామీ ఇచ్చారు.