- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
సీఎం కప్ టోర్నీని విజయవంతం చేయాలి: మంత్రి శ్రీనివాస్ గౌడ్
దిశ, తెలంగాణ బ్యూరో: అధికారులు సమన్వయంతో పనిచేసి సీఎం కప్ రాష్ట్రస్థాయి టోర్నీని విజయవంతం చేయాలని మంత్రి శ్రీనివాస్ గౌడ్ అదేశించారు. నిర్లక్ష్యం చేస్తే ఊపేక్షించబోమని హెచ్చరించారు. ఎల్బీ స్టేడియంలో సీఎం కప్ టోర్నీ ఏర్పాట్లను శుక్రవారం పరిశీలించారు. అనంతరం అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ టోర్నీలో లోటుపాట్లు లేకుండా అన్ని ఏర్పాట్లు పూర్తి చేయాలని అధికారులకు సూచించారు. తెలంగాణ దశాబ్ది ఉత్సవాలను ప్రతిబింబించేలా క్రీడాకారులకు సాంస్కృతిక కార్యక్రమాలు ఉండాలన్నారు.
ఈ నెల 28 నుంచి 31వ తేదీ వరకు రాష్ట్రస్థాయి పోటీలను నిర్వహిస్తున్నామని తెలిపారు. రాష్ట్రవ్యాప్తంగా 33 జిల్లాల నుంచి విచ్చేసిన క్రీడాకారులు, క్రీడాకారిణిలకు ఎటువంటి ఇబ్బందులు తలెత్తకుండా అధికారులు జాగ్రత్తలు తీసుకోవాలన్నారు. ఈ సమావేశంలో శాసనమండలి డిప్యూటీ చైర్మన్ బండ ప్రకాష్, స్పోర్ట్స్ అథారిటీ ఛైర్మన్ డాక్టర్ ఆంజనేయ గౌడ్, క్రీడల శాఖ ముఖ్య కార్యదర్శి సందీప్ కుమార్ సుల్తానియా, ఓఎస్‌డీ లక్ష్మి, డిప్యూటీ డైరెక్టర్లు సుజాత, ధనలక్ష్మి, అనురాధ, దీపక్ మనోహర్, స్పోర్ట్స్ స్కూల్ ఓఎస్‌డీ డాక్టర్ హరి కృష్ణ, ఇతర శాఖల అధికారులు పాల్గొన్నారు.