బీఆర్ఎస్, బీజేపీ ప్రమాదకరంగా మారాయి: భట్టి

by GSrikanth |
బీఆర్ఎస్, బీజేపీ ప్రమాదకరంగా మారాయి: భట్టి
X

దిశ, డైనమిక్ బ్యూరో: కాంగ్రెస్ హయాంలో జరిగిన అభివృద్ధితో భూముల రేట్లు పెరిగితే బీఆర్ఎస్ ప్రభుత్వం ఆ భూములతో పాటు తెలంగాణను అమ్మేస్తోందని సీఎల్పీ లీడర్ భట్టి విక్రమార్క విమర్శించారు. బీఆర్ఎస్, బీజేపీ ప్రమాదకరంగా మారాయాని, మతం పేరుతో దేశాన్ని బీజేపీ విడదీస్తోందని ధ్వజమెత్తారు. శనివారం మీడియాతో మాట్లాడిన ఆయన కేసీఆర్ 24 గంటల కరెంటు ఇస్తున్నామని గొప్పులు చెప్పుకుంటున్నారు.

తెలంగాణ ఏర్పాటయ్యాక రాష్ట్ర ప్రభుత్వం కేవలం భద్రాద్రి, యాదాద్రి విద్యుత్ ప్రాజెక్టులు మాత్రమేనని ఇందులో యాదాద్రి ప్రాజెక్టు ఇప్పటి వరకు ప్రొడక్షన్‌లోకే రాలేదని భద్రాద్రి గతేడాది వెయ్యి మెగావాట్లతో ప్రొడక్షన్‌లోకి వచ్చిందని అలాంటప్పుడు గతంలో కాంగ్రెస్ ప్రభుత్వం కరెంట్ ఇవ్వలేదని ఎలా ప్రచారం చేస్తారని నిలదీశారు. కాంగ్రెస్ హయాంలో నిర్మించిన ప్రాజెక్టులతోనే హైదరాబాద్‌కు ఇప్పటికీ నీళ్లు వస్తున్నాయన్నారు. కేసీఆర్ వచ్చాక కొత్త ఏ నది నుంచి ఏ ప్రాజెక్టు నుంచి హైదరాబాద్‌కు నీళ్లు తీసుకువచ్చారో చెప్పాలన్నారు. కేవలం ప్రచారం చేసుకోవడం వల్లే బీఆర్ఎస్, బీజేపీలు ముందు ఉంటే చేసిన పనులు చేసుకోలేకనే కాంగ్రెస్ వెనుకబడిందన్నారు.

Advertisement

Next Story