- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
అసలు చర్చ జరగాల్సింది దానిపైనే.. బీజేపీపై భట్టి సీరియస్
దిశ, వెబ్‌డెస్క్: టీఆర్ఎస్, బీజేపీ నేతలపై సీఎల్పీ నేత భట్టి విక్రమార్క తీవ్ర విమర్శలు చేశారు. తెలంగాణ వజ్రోత్సవ వేడుకల కార్యక్రమంలో ఆయన పాల్గొని మాట్లాడారు. బీజేపీ విమోచన, టీఆర్ఎస్ సమైక్యత దినోత్సవం పేరుతో ఉత్సవాలు నిర్వహిస్తూ అసలు చర్చను పక్కదోవ పట్టిస్తున్నాయని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆనాటి జమీందారి వ్యవస్థ భూస్వాముల గడీలపై చర్చ జరగాలని హితవు పలికారు. తెలంగాణలో భూమి పంచింది కేవలం కాంగ్రెస్ పార్టీనే అని గుర్తుచేశారు. మత ఘర్షణలు సృష్టించి, తెలంగాణను కబళించాలని ప్రయత్నిస్తున్న విచ్ఛిన్నకర శక్తులు విమోచన దినం పేరిట సభలు జరపడం సరికాదని అన్నారు. ఉత్సవాలు గర్వంగా గౌరవంగా ఉండాలని తెలిపారు. తెలంగాణ సాయుధ పోరాటానికి బీజేపీకి అసలేం సంబంధం లేదని ఎద్దేవా చేశారు. కేవలం చరిత్రను వక్రీకరించడానికే బీజేపీ రాష్ట్రంలో కుట్ర చేస్తోందని మండిపడ్డారు. మతం రంగు పూసి ప్రజల మధ్యన విద్వేషాలను రెచ్చగొట్టడానికి విచ్ఛిన్నకర శక్తులు చేస్తున్న ప్రయత్నాలను తిప్పి కొట్టాలని పిలుపునిచ్చారు.