జిల్లాకో పెట్రోల్ బంక్.. సివిల్ సప్లయిస్ చైర్మన్ సర్దార్ రవీందర్ సింగ్

by Javid Pasha |
జిల్లాకో పెట్రోల్ బంక్..  సివిల్ సప్లయిస్ చైర్మన్ సర్దార్ రవీందర్ సింగ్
X

దిశ, తెలంగాణ బ్యూరో: పౌరసరఫరాల సంస్థ ఆదాయం పెంచడంలో భాగంగా పౌరసరఫరాల శాఖ మంత్రి గంగుల కమలాకర్ సూచన మేరకు జిల్లాకు ఒకటి చొప్పున పెట్రోల్ బంక్‌లను ఏర్పాటు చేయాలని నిర్ణయించడం జరిగిందని సివిల్ సప్లయిస్ చైర్మన్ సర్దార్ రవీందర్ సింగ్ పేర్కొన్నారు. ఈ మేరకు ఆయన గురువారం ఒక ప్రకటనలో తెలిపారు. జిల్లాల్లో పెట్రోల్ బంక్‌లకు అనువైన ల్యాండ్‌ను గుర్తించి ఆయా ఆయిల్ కంపెనీలకు బంక్‌ల కేటాయింపు జరపడానికి 5 మంది అధికారులతో కమిటీని ఏర్పాటు చేసినట్లు తెలిపారు. ఈ కమిటీలో జనరల్ మేనేజర్లు ఫైనాన్స్, మార్కెటింగ్, ప్రొక్యూర్మెంట్, డీజీఎం ఫైనాన్స్, డీఎం హైదరాబాద్ సభ్యులుగా నియమించామన్నారు.

ఈ కమిటీ పలుమార్లు సమావేశమై తొలివిడతలో 9 జిల్లాల్లో ఏర్పాటుకు ఆమోదం తెలిపారని వివరించారు. కరీంనగర్, రంగారెడ్డి, మేడ్చల్, సంగారెడ్డి (ఐఓసీ), కొత్తగూడెం, మేడ్చల్, ఖమ్మం (హెచ్‌పీసీఎల్), జగిత్యాల్, మెదక్ (బీపీసీఎల్) ఆధ్వర్యంలో బంక్‌లను ఏర్పాటు చేస్తున్నట్లు స్పష్టంచేశారు. పెట్రోల్ బంక్ పనులను ప్రారంభించి వీలైనంత త్వరలో వినియోగదారులకు అందుబాటులోకి తీసుకురావాలని ఐఓసీ, హెచ్‌పీసీఎల్, బీపీసీఎల్ ఆయిల్ కంపెనీలను ఆదేశించినట్లు తెలిపారు. రెండో దశలో మరో పది జిల్లాల్లో పెట్రోల్ బంకుల ఏర్పాటు ప్రతిపాదనలు సిద్ధం చేయాలని అధికారులను ఆదేశించారు.

Advertisement

Next Story