ఖేలో ఇండియా క్రీడల్లో సత్తా చాటిన సిటీ కళాశాల విద్యార్థులు

by Kalyani |   ( Updated:2023-02-13 15:25:39.0  )
ఖేలో ఇండియా క్రీడల్లో సత్తా చాటిన సిటీ కళాశాల విద్యార్థులు
X

దిశ, చార్మినార్: మధ్యప్రదేశ్ లోని 11 నగరాలలో 13 రోజుల పాటు జరిగిన ఖేలో ఇండియా యువజన క్రీడల్లో ఫెన్సింగ్ అండర్ 18 విభాగంలో తెలంగాణ రాష్ట్రానికి చెందిన సిటీ కళాశాల విద్యార్థులు తమ సత్తా చాటారు. బీఏ విద్యార్థులు బేబి రెడ్డి, మురళి, బీ శ్రవణ్ లు కళాశాల పేరును మరోసారి జాతీయ స్థాయిలో చాటారని ప్రిన్సిపాల్ డా. పీ బాలభాస్కర్ ఒక ప్రకటనలో తెలిపారు.

బేబి రెడ్డి రజత పతకం సాధించగా, మురళి, శ్రవణ్ లు కాంస్య పతకాలు సాధించి కళాశాలకే కాక, రాష్ట్రానికి కూడా గర్వకారణంగా నిలిచారన్నారు. తమ విద్యార్థులు జాతీయ, అంతర్జాతీయ వేదికలపై విజయాన్ని చేజిక్కించుకోవటం సంతోషంగా ఉందని అన్నారు. విజేతలను ప్రిన్సిపాల్, అధ్యాపకులు, విద్యార్థులు అభినందించారు.

Also Read..

గురుకుల పాఠశాలల్లో బ్యాక్ లాగ్ సీట్ల భర్తీకి ప్రకటన..

Advertisement

Next Story